Tori Bowie: మూడు ఒలింపిక్ పతకాల విజేత టోరీ బౌవీ.. 32 ఏళ్లకే మృతి

Tori Bowie: ఆమె మృతి పట్ల క్రీడాలోకం దిగ్భ్రాంతికి గురైంది.

Tori Bowie: మూడు ఒలింపిక్ పతకాల విజేత టోరీ బౌవీ.. 32 ఏళ్లకే మృతి

Tori Bowie

Updated On : May 4, 2023 / 9:40 PM IST

Tori Bowie: అమెరికా స్ప్రింటర్, లాంగ్ జంపర్, మూడుసార్లు ఒలింపిక్ పతకాలు గెలుచుకున్న టోరీ బౌవీ (32) తన గదిలో విగతజీవిగా కనపడ్డారు. టోరీ బౌవీ (Tori Bowie) 32 ఏళ్లకే మృతి చెందడం విస్మయానికి గురిచేస్తోంది. ఫ్లోరిడా (Florida)లోని ఇంట్లో టోరీ బౌవీ మృతి చెందినట్లు ప్రతినిధి తెలిపారు.

తమ క్లయింట్, స్నేహితురాలు, కుమార్తె, సోదరి టోరీని కోల్పోయామంటూ ఆమె మేనేజ్‌మెంట్ ఏజెన్సీ ఐకాన్ మేనేజ్‌మెంట్ ఇన్‌కార్పొరేషన్ కూడా ఇన్‌స్టాగ్రామ్ లో పేర్కొంది. ఆమె కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలుపుతున్నట్లు చెప్పింది. టోరీ బౌవీ ఎందుకు మృతి చెందిందన్న విషయంపై స్పష్టత లేదు.

ఆమె మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. 2016 రియో ఒలింపిక్ గేమ్స్ లో టోరీ బౌవీ ఓ బంగారు పతకం, ఓ వెండి, ఓ రజత పతకం గెలుచుకున్నారు. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెండు బంగారు, ఓ రజత పతకం సాధించారు. ఆమె అమ్మమ్మ పెంపకంలో పెరిగారు.

పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగారు. ఆమె మృతిపై వరల్డ్ అథ్లెటిక్ స్పందిస్తూ… అరుదైన టాలెంట్ ఉన్న క్రీడాకారిని కోల్పోయామని పేర్కొంది. అమెరికా తరఫున ఆమె స్ప్రింట్స్ తో పాటు లాంగ్ జంపర్ గానూ అద్భుతంగా రాణించడాన్ని కొనియాడుతూ ఓ ప్రకటన చేసింది.

IPL 2023, SRH vs KKR: ఛేద‌న‌కు దిగిన స‌న్‌రైజ‌ర్స్‌..Live Updates