2023 ODI World Cup: వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగదా? బీసీసీఐ వైఖరే కారణమా? ఏం జరుగుతోంది
2023, అక్టోబర్ నుంచి వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.

2023 ODI World Cup: వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌కు ఇండియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉన్న సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం… 2023, అక్టోబర్ నుంచి ఈ టోర్నీ ఇండియాలో ప్రారంభం కావాలి. అయితే, ఇప్పుడు ఈ టోర్నీ నిర్వహణపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో ఇండియా (బీసీసీఐ) వ్యవహరిస్తున్న తీరు కూడా ఒక కారణమే.
ఇప్పటికే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణపై ఇటు బీసీసీఐ, అటు ఐసీసీ మధ్య వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏసీసీ (ఆసియన్ క్రికెట్ కౌన్సిల్)తో కూడా బీసీసీఐకి సమస్య తలెత్తింది. వచ్చే ఏడాది క్రికెట్‌కు సంబంధించి రెండు మెగా టోర్నీలు జరగనున్నాయి. ఒకటి ఐసీసీ వన్డే వరల్డ్ కప్. దీనికి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. రెండోది ఆసియా కప్. దీనికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే, పాకిస్తాన్‌లో జరిగే ఆసియా కప్‌లో తాము పాల్గొనబోమని ఇండియా తరఫున బీసీసీఐ ప్రకటించింది. ఇదే జరిగితే, తాము ఐసీసీ వన్డే వరల్డ్ కప్ బహిష్కరిస్తామని పాక్ హెచ్చరించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఈ అంశంపై వివాదం నడుస్తోంది.
Elon Musk: విమర్శలతో వెనక్కు తగ్గిన ఎలన్ మస్క్.. జర్నలిస్టుల అకౌంట్లు రీస్టోర్ చేసిన ట్విట్టర్
ఇది రెండు టోర్నీల నిర్వహణకు ప్రతిబంధంకంగా మారింది. నిబంధనల ప్రకారం ఇండియా.. ఆసియా కప్ కోసం పాకిస్తాన్ వెళ్లకపోయినా, లేక వన్డే ప్రపంచ కప్ కోసం పాకిస్తాన్.. ఇండియా రాకపోయినా టోర్నీల నిర్వహణకు సమస్యే. ఈ అంశంపై బీసీసీఐతో ఏసీసీ, ఐసీసీ చర్చలు జరుపుతోంది. ఈ చర్చలు, వివాదం కొలిక్కి వస్తేనే ఇండియాలో వరల్డ్ కప్ నిర్వహణ సాధ్యమవుతుంది. మరోవైపు పన్నుల అంశం కూడా టోర్నీ నిర్వహణకు సమస్యగా మారింది. ఐసీసీ నిబంధనల ప్రకారం… వరల్డ్ కప్ నిర్వహించాలంటే ఆతిథ్య దేశం ఐసీసీకి పన్ను మినహాయింపు ఇవ్వాలి. అయితే, ఈ విషయంలో ఏమీ చేయలేమని బీసీసీఐ, ఐసీసీకి తెలిపింది.
దీంతో పన్నుల విషయంలో ఐసీసీ ఒక నిర్ణయం తీసుకుంటే కానీ, ఇండియాలో వరల్డ్ కప్ జరుగుతుందా.. లేదా అనేది తేలదు. గతంలో 2016లో నిర్వహించిన టోర్నీ సందర్భంగా పన్ను మినహాయింపు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో బీసీసీఐకి రావాల్సిన వాటిలో, పన్నుగా చెల్లించిన రూ.190 కోట్లను తగ్గించి ఇచ్చింది ఐసీసీ.