పెళ్లి చేసుకోబోతున్న ఆర్‌సీబీ బౌలర్.. ఐపిఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేడు

పెళ్లి చేసుకోబోతున్న ఆర్‌సీబీ బౌలర్.. ఐపిఎల్ ఓపెనింగ్ మ్యాచ్ ఆడలేడు

Adam Zampa To Miss Rcbs Season Opener Against Mumbai Indians

Updated On : March 24, 2021 / 3:38 PM IST

స్టార్ ఆటగాళ్లు ఉన్నప్పటికీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ ఫ్రాంచైజ్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రతి సీజన్లో అభిమానులు నిరాశ పరుస్తూనే ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ సారధ్యంలో నడుస్తోన్న బెంగళూరు జట్టు ఇప్పటివరకు టైటిల్‌ను గెలవలేకపోయింది, అయితే ఈసారి కొన్ని కొత్త ముఖాల రాకతో కథ వేరే ఉంటదని అంటుంది ఆ జట్టు యాజమాన్యం.

ఈ ఏడాది ఐపీఎల్ ఏప్రిల్ 9వ తదీ నుంచి ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. టోర్నమెంట్ ప్రారంభించడానికి చాలా తక్కువ సమయం మిగిలి ఉండగా.. మైక్ హ్యూసన్ ఆర్‌సిబి క్యాంప్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. జట్టు స్పిన్నర్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడని, టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండకపోవచ్చునని వెల్లడించాడు.

ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా వివాహం చేసుకోబోతుండగా.. ఐపీఎల్ మ్యాచ్‌లకు దూరం కావచ్చునని, జట్టు ఆపరేషన్స్ డైరెక్టర్ మైక్ హ్యూసన్ ధృవీకరించారు. జట్టు అతని నిర్ణయాన్ని గౌరవిస్తుందని, ప్రారంభ మ్యాచ్‌లో మాత్రమే జట్టుతో ఉండకపోవచ్చునని అన్నారు. “ఆడమ్ జంపా పెళ్లి చేసుకోబోతున్నాడు” అని హ్యూసన్ వీడియోలో పేర్కొన్నాడు. జంపాకు ఈ సమయం చాలా ముఖ్యమైనది.. ఫ్రాంఛైజీగా మాకు ఈ విషయం తెలుసు.. అతని నిర్ణయాన్ని గౌరవిస్తాము.. అని అన్నారు.