IPL 2020 లో అమెరికన్ ప్లేయర్

  • Published By: madhu ,Published On : September 13, 2020 / 07:58 AM IST
IPL 2020 లో అమెరికన్ ప్లేయర్

Updated On : September 13, 2020 / 8:27 AM IST

IPL 2020 లో అమెరికన్ ప్లేయర్ ఆలీ ఖాన్ అడుగు పెట్టబోతున్నాడు. ఇతను ఫాస్ట్ బౌలర్. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ప్లేయర్ హారీ గర్నే ప్లేస్ లో ఇతను రానున్నారు. గర్నే భుజానికి ఆపరేషన్ జరుగతుండడంతో అతను వైదొలిగాడు. ఐపీఎల్ లో అడుగుపెడుతున్న తొలి అమెరికన్ ప్లేయర్ గా రికార్డులకు ఎక్కనున్నాడు. ఇతను కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో ట్రిబాంగో నైట్ రైడర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఆడిన 12 మ్యాచ్ లను గెలిచిన ట్రిబాంగో..టైటిల్ కైవసం చేసుకుంది. 8 మ్యాచ్ లు ఆడిన ఆలీ…8 వికెట్లు తీశాడు.



దుబాయ్ లో ఐపీఎల్ మ్యాచ్ లు జరుగనున్న సంగతి తెలిసిందే. చెన్న సూపర్ కింగ్ ఆటగాడు..బ్రావోతో కలిసి…ఆలీ ఖాన్ విమానంలో ప్రయాణిస్తున్న ఒక ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో అతను ఐపీఎల్ లో ఆడుతున్నాడనే సంగతి తెలిసిందే. దినేష్ కార్తీక్ సారథ్యంలోని సెప్టెంబర్ 23వ తేదీన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ముంబై ఇండియన్స్ జట్టులు తలపడనున్నాయి.



2018 సంవత్సరంలో కెనాడలో గ్లోబల్ 20 అనంతరం ఖాన్ ప్రాముఖ్యత పొందాడు. ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో దృష్టిలో పడ్డాడు. అనంతరం అతడిని సీపీఎల్ కు తీసుకొచ్చాడు. అమెజాన్ వారియర్స్ తరపున ఆడిన ఖాన్ 12 మ్యాచ్ ల్లో 16 వికెట్లు తీశాడు. యూఎస్ఏ స్వ్కాడ్ తరపున ఎంపికయ్యాడు. సీపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత..తన ఫస్ట్ డెలివరీతో సంగక్కరను అవుట్ చేశాడు. ఐపీఎల్ లో ఎంపిక కావడం సంతోషంగా ఉందని, కల నిజమైందని ఖాన్ తెలిపారు.