Virat Kohli Dance : అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్‌లతో విరాట్ కోహ్లి డ్యాన్స్.. హీరోలకు మించి స్టెప్పులేసిన కోహ్లి
భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి.

Arshdeep Singh And Virat Kohli Dance To Tunak Tunak After Winning T20 World Cup
ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. 17 ఏళ్ల తరువాత టీమ్ఇండియా మరోసారి టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. శనివారం బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచులో దక్షిణాఫ్రికా పై భారత్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఇక భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన తరువాత టీమ్ సభ్యులతో విరాట్ కోహ్లి డ్యాన్స్ చేశాడు. అర్ష్‌దీప్, సిరాజ్, అక్షర్‌పటేట్‌లతో కలిసి పాపులర్ పాట ‘తునక్ తునక్’ పాటపై ‘భాంగ్రా’ నృత్యం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
PM Modi : టీ20 ప్రపంచకప్ విజేతగా భారత్.. రోహిత్ సేనకు ప్రధాని మోదీ ఫోన్..
ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ అనంతరం టీ20 ఫార్మాట్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి లు రిటైర్‌మెంట్ ప్రకటించారు. 2010లో జింబాబ్వే పై టీ20ల్లో అరంగ్రేటం చేశాడు కోహ్లి. 125 మ్యాచుల్లో 48.69 సగటుతో 4188 పరుగులు చేశాడు. తన చివరి మ్యాచ్ అయిన ప్రపంచకప్ పైనల్లో 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాది 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ను అందుకున్నాడు.
‘నా చివరి టీ20 ప్రపంచకప్‌ను ఎలా ముగించాలని అనుకున్నానో అలాగే ముగించా. సుదీర్ఘ నిరీక్షణ ఫలించింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్ మ్యాచే కెరీర్‌లో ఆఖరిది. భవిష్యత్ తరం వచ్చే సమయం ఇది.’ అని ఫైనల్ అనంతరం కోహ్లి చెప్పాడు.
View this post on Instagram