Arshdeep Singh : ఆల్‌టైమ్ రికార్డ్ పై కన్నేసిన అర్ష్‌దీప్.. దక్షిణాఫ్రికాతో 4టీ20 మ్యాచ్‌లో అందుకునేనా?
చాలా తక్కువ సమయంలో టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా గొప్ప బౌలర్లలో ఒకడిగా నిలిచాడు పేసర్ అర్ష్‌దీప్ సింగ్.

Arshdeep Singh need 5 wickets to become indias highest wicket taker
Arshdeep Singh : చాలా తక్కువ సమయంలో టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా గొప్ప బౌలర్లలో ఒకడిగా నిలిచాడు పేసర్ అర్ష్‌దీప్ సింగ్. 2022లో అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అడుగుపెట్టిన అతడు ఇప్పటి వరకు 59 టీ20 మ్యాచులు ఆడాడు. మొత్తంగా 92 వికెట్లు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు సాధించిన భారత పేసర్‌గా నిలిచాడు. ఇక దక్షిణాఫ్రికా గడ్డపైనా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు.
కాగా.. టీ20 క్రికెట్‌లో మరో ఐదు వికెట్లు గనుక అర్ష్‌దీప్ సింగ్ తీస్తే.. టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. ప్రస్తుతం ఈ ఘనత స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పేరిట ఉంది. 80 మ్యాచుల్లో చాహల్ 96 వికెట్లు పడగొట్టాడు. రెండో స్థానంలో అర్ష్‌దీప్ ఉన్నాడు.
Sanju Samson : దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్.. ఈ మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ డకౌట్ అయితే?
వీరిద్దరి తరువాత భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రాలు ఉన్నారు. కాగా.. నేడు భారత జట్టు దక్షిణాఫ్రికాతో జోహెన్నెస్‌బర్గ్ వేదికగా నాలుగో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో అర్ష్‌దీప్ సింగ్ ఈ రికార్డును అందుకుంటాడో లేదో చూడాలి.
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు..
* యుజ్వేంద్ర చాహల్ – 80 మ్యాచుల్లో 96 వికెట్లు
* అర్ష్‌దీప్ సింగ్ – 59 మ్యాచుల్లో – 92 వికెట్లు
* భువనేశ్వర్ కుమార్ – 87 మ్యాచుల్లో – 90 వికెట్లు
* జస్‌ప్రీత్ బుమ్రా – 70 మ్యాచుల్లో – 89 వికెట్లు
* హార్దిక్ పాండ్యా – 108 మ్యాచ్‌ల్లో – 88 వికెట్లు
AUS vs IND : బాబోయ్.. ఆసీస్ గడ్డపై ఇరగదీస్తున్న భారత బ్యాటర్లు.. 15, 15, 19.. ఇలా ఆడితే..