Sanju Samson : దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20 మ్యాచ్.. ఈ మ్యాచ్‌లోనూ సంజూ శాంసన్ డకౌట్ అయితే?
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సంజూ శాంసన్.

Samson is one duck away from equalling Kohli embarrassing numbers
టీ20ల్లో వరుసగా రెండు సెంచరీలు చేసి భారత జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు సంజూ శాంసన్. ఆ తరువాత వరుసగా రెండు మ్యాచుల్లో డకౌట్లు అయ్యాడు. ఇక నేడు దక్షిణాఫ్రికాతో జోహెన్నెస్ బర్గ్ వేదికగా జరగనున్న నాలుగో టీ20 మ్యాచ్‌లోనూ శాంసన్ డకౌట్ అయితే మాత్రం తన పేరిట ఓ చెత్త రికార్డును మూటగట్టుకోనున్నాడు. స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సరసన చేరుతాడు.
టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 117 ఇన్నింగ్స్‌లు ఆడగా ఏడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇక అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో సంజూ శాంసన్ ఇప్పటి వరకు 32 ఇన్నింగ్స్‌లు ఆడగా ఆరు సార్లు డకౌట్ అయ్యాడు. నేటి మ్యాచులో గనుక డకౌట్ అయితే.. ఏడు సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా రికార్డులకు ఎక్కనున్నాడు.
AUS vs IND : బాబోయ్.. ఆసీస్ గడ్డపై ఇరగదీస్తున్న భారత బ్యాటర్లు.. 15, 15, 19.. ఇలా ఆడితే..
టీమ్ఇండియా తరుపున కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీ టీ20 క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 151 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు ఖాతా తెరవకుండానే నిష్ర్కమించాడు.
టీమ్ఇండియా తరుపున టీ20ల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లు..
రోహిత్ శర్మ – 151 ఇన్నింగ్స్‌ల్లో 12 సార్లు
విరాట్ కోహ్లీ – 117 ఇన్నింగ్స్‌ల్లో 7 సార్లు
సంజూ శాంసన్ – 32 ఇన్నింగ్స్‌ల్లో 6 సార్లు
కేఎల్ రాహుల్ – 68 ఇన్నింగ్స్‌ల్లో 5 సార్లు
శ్రేయస్ అయ్యర్ – 47 ఇన్నింగ్స్‌ల్లో 4 సార్లు