Weather Updates: మళ్లీ వానలు..! అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన..!
అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
Weather Updates: ఏపీలో మళ్లీ వానలు కురవనున్నాయి. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. తదుపరి 48 గంటల్లో మరింత బలపడి పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
గురువారం (20-11-2025)..
ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
శుక్రవారం (21-11-2025)..
కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందంది.
Also Read: డబ్బులు పడ్డాయ్.. అకౌంట్లు చెక్ చేసుకోండి.. అన్నదాత సుఖీభవ నిధులు విడుదల..
