IND vs PAK : వ‌రుణుడి ఆట‌.. మ్యాచ్ ర‌ద్దు.. భార‌త్‌, పాకిస్తాన్‌కు చెరో పాయింట్‌

క్రికెట్ అభిమానుల ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. ఆసియా క‌ప్ (asia cup) 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు.

IND vs PAK : వ‌రుణుడి ఆట‌.. మ్యాచ్ ర‌ద్దు.. భార‌త్‌, పాకిస్తాన్‌కు చెరో పాయింట్‌

IND vs PAK

Updated On : September 2, 2023 / 10:06 PM IST

IND vs PAK : క్రికెట్ అభిమానుల ఆశ‌ల‌పై వ‌రుణుడు నీళ్లు చ‌ల్లాడు. ఆసియా క‌ప్ (asia cup) 2023లో భాగంగా ప‌ల్లెక‌లె వేదిక‌గా భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గాల్సిన మ్యాచ్‌ను అంపైర్లు ర‌ద్దు చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ప‌లుమార్లు ఆట‌కు అంత‌రాయం క‌లిగించిన వ‌రుణుడు భార‌త ఇన్నింగ్స్ ముగిసిన త‌రువాత త‌న ప్ర‌తాపాన్ని చూపించాడు. ఎంత‌సేప‌టికి వ‌ర్షం త‌గ్గ‌క‌పోవ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇరు జ‌ట్ల‌కు చెరో పాయింట్‌ను ఇచ్చారు.

Mahika Gaur : ధోనిని ఆరాధించే క్రికెట‌ర్‌.. చ‌రిత్ర సృష్టించింది

అంత‌క‌ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భార‌త్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(11), శుభ్‌మ‌న్ గిల్‌(10), విరాట్ కోహ్లి(4)ల‌తో పాటు నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగి జ‌ట్టును ఆదుకుంటాడు అని భావించిన శ్రేయ‌స్ అయ్య‌ర్ (14) లు విఫ‌లం కావ‌డంతో టీమ్ఇండియా 66 ప‌రుగుల‌కే నాలుగు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో వికెట్ కీప‌ర్ ఇషాన్ కిష‌న్ (82; 81 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్య (87; 90 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) జ‌ట్టును ఆదుకున్నారు.

Rinku Singh : సూప‌ర్ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ పెను విధ్వంసం.. హ్యాట్రిక్ సిక్స‌ర్లు.. వీడియో వైర‌ల్‌

మొద‌ట క్రీజులో కుదురుకునేందుకు ప్ర‌య‌త్నించిన వీరు క్ర‌మంగా జోరు పెంచారు. ఈ క్ర‌మంలో ఇషాన్ కిష‌న్ 54 బంతుల్లో హ‌ర్దిక్ 62 బంతుల్లో హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. అర్థ‌శ‌త‌కం త‌రువాత ఇషాన్ కిష‌న్ మ‌రింత వేగంగా ఆడాడు. అయితే.. సెంచరీ దిశ‌గా సాగుతున్న కిష‌న్‌ను హారిస్ ర‌వూఫ్ ఔట్ చేసి 138 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని విడ‌దీశాడు. ఆ త‌రువాత జ‌డేజా (14) అండ‌తో హ‌ర్దిక్ వేగంగా ఆడాడు. అయితే ఒకే ఓవ‌ర్‌లో షాహిన్ అఫ్రిది.. హ‌ర్దిక్‌తో పాటు జ‌డేజాల‌ను ఔట్ చేసి భార‌త్‌ను గ‌ట్టి దెబ్బ‌కొట్టాడు. ఆ మ‌రుస‌టి ఓవ‌ర్‌లోనే శార్దూల్ ఠాకూర్‌(3) సైతం ఔట్ కావ‌డంతో భార‌త ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. పాకిస్తాన్ బౌల‌ర్ల‌లో ష‌హీన్ అప్రీది నాలుగు వికెట్లు తీయ‌గా, న‌దీమ్ షా, హారిస్ ర‌వూఫ్ లు చెరో మూడు వికెట్లు తీశారు.