SL vs AFG : అఫ్గానిస్తాన్ ఆశలపై దెబ్బ కొట్టిన శ్రీలంక.. బ‌తికిపోయిన బంగ్లాదేశ్..

ఆసియాక‌ప్ 2025లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. శ్రీలంక చేతిలో ఓడిపోయింది (SL vs AFG).

SL vs AFG : అఫ్గానిస్తాన్ ఆశలపై దెబ్బ కొట్టిన శ్రీలంక.. బ‌తికిపోయిన బంగ్లాదేశ్..

Asia Cup 2025 Sri Lanka won by 6 wickets against Afghanistan

Updated On : September 19, 2025 / 9:03 AM IST

SL vs AFG : ఆసియాక‌ప్ 2025లో అఫ్గానిస్తాన్ పోరాటం ముగిసింది. సూప‌ర్ 4 రేసులో నిల‌వాలంటే త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ ఓడిపోయింది. గురువారం అబుదాబి వేదిక‌గా శ్రీలంక‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఈ విజ‌యంతో శ్రీలంక గ్రూప్ స్టేజీలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో గెలిచి గ్రూప్‌-బి టాప‌ర్‌గా సూప‌ర్‌-4లో అడుగుపెట్టింది. అఫ్గాన్ ఓడిపోవ‌డంతో నాలుగు పాయింట్ల‌తో ఉన్న బంగ్లాదేశ్ గ్రూప్‌-బి నుంచి రెండో జ‌ట్టుగా సూప‌ర్‌4కి చేరుకుంది.

Asia Cup 2025 : ఆసియాక‌ప్‌లో సూపర్-4కు చేరిన 4 జట్లు.. భార‌త్ ఆడే మ్యాచ్‌ల వివ‌రాలు, పూర్తి షెడ్యూల్ ఇదే..

ఈ మ్యాచ్‌లో (SL vs AFG ) అఫ్గానిస్తాన్ జ‌ట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 169 ప‌రుగులు సాధించింది. అఫ్గాన్ బ్యాట‌ర్ల‌లో మ‌హ్మ‌ద్ న‌బి (60; 22 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) మెరుపులు మెరిపించాడు.

ఇబ్ర‌హీం జ‌ద్రాన్ (24), ర‌షీద్ ఖాన్ (24)లు ఫ‌ర్వాలేనిపించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. శ్రీలంక బౌల‌ర్ల‌లో నువాన్‌ తుషార నాలుగు వికెట్లు తీశాడు. దునిత్ వెల్లలాగే, చ‌మీర‌, ధ‌సున్ శ‌న‌క‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

Hardik Pandya : ఒమ‌న్‌తో మ్యాచ్‌.. హార్దిక్ పాండ్యాను ఊరిస్తున్న భారీ రికార్డు..

ఆ త‌రువాత కుశాల్ మెండీస్ (74నాటౌట్; 52 బంతుల్లో 10 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగ‌డంతో 170 ప‌రుగుల ల‌క్ష్యాన్ని శ్రీలంక జ‌ట్టు 18.4 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి అందుకుంది. లంక బ్యాట‌ర్లో కుశాల్ పెరీరా(28), మిందు మెండిస్‌ (26 నాటౌట్‌) లు రాణించారు. అఫ్గాన్ బౌల‌ర్ల‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్ త‌లా ఓ వికెట్ సాధించారు.

ఆసియాక‌ప్ 2025లో అఫ్గాన్ జ‌ట్టు మూడు మ్యాచ్‌లు ఆడ‌గా ఒకే మ్యాచ్‌లో గెలుపొందింది.