Asian Games : జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 ప‌త‌కాలు.. నీరజ్‌ చోప్రాకు గోల్డ్, కిశోర్‌కు ర‌జ‌తం

చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ దూసుకుపోతుంది. జావెలియ‌న్ త్రోలో భార‌త్‌కు ఒకే రోజు రెండు ప‌త‌కాలు వ‌చ్చాయి.

Asian Games : జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 ప‌త‌కాలు.. నీరజ్‌ చోప్రాకు గోల్డ్, కిశోర్‌కు ర‌జ‌తం

Neeraj Chopra-Kishore Jena

Asian Games 2023 : చైనా వేదిక‌గా జ‌రుగుతున్న ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ దూసుకుపోతుంది. జావెలియ‌న్ త్రోలో భార‌త్‌కు ఒకే రోజు రెండు ప‌త‌కాలు వ‌చ్చాయి. నీరజ్ చోప్రా గోల్డ్ మెడ‌ల్ కైవ‌సం చేసుకోగా, కిశోర్ కుమార్ ర‌జ‌తం అందుకున్నాడు. నీర‌జ్ 88.88 మీట‌ర్ల దూరం జావెలిన్ విస‌ర‌గా, కిషోర్ కుమార్ జెనా 87.54 మీట‌ర్ల దూరం విసిరి ర‌త‌జం గెలుచుకున్నాడు. ఓ ద‌శ‌లో కిశోర్ ఆధిప‌త్యంలో కొన‌సాగ‌గా, నీర‌జ్ త‌న సీజ‌న్ బెస్ట్ త్రోను న‌మోదు చేయ‌డంతో కిశోర్ ర‌జతంతో స‌రిపెట్టుకోవాల్సి వ‌చ్చింది. దీంతో వీరిద్ద‌రు పారిస్ ఒలంపిక్స్‌కు అర్హ‌త సాధించారు.

మ‌రోవైపు మహిళల 800 మీటర్లలో రిలేలో హర్మిలన్‌, 5000 మీటర్ల రేస్‌లో అవినాష్‌ రజత పతకాలు కైవ‌సం చేసుకున్నారు. 4×400 మీటర్ల విభాగంలో పురుషుల బృందం గోల్డ్‌, మహిళల బృందం రజత పతకం సాధించాయి. దీంతో ఆసియా క్రీడ‌ల్లో భార‌త్ సాధించిన ప‌త‌కాల సంఖ్య 80కి చేరింది. ఇందులో స్వ‌ర్ణం 18, ర‌జ‌తం 30, కాంస్యం 32 ఉన్నాయి. ప్రస్తుతం భార‌త్ నాలుగో స్థానంలో కొన‌సాగుతోంది.

Also Read : కెప్టెన్సీడే లో నిద్ర‌పోతున్న ద‌క్షిణాఫ్రికా కెప్టెన్‌.. జో జో లాలీ అంటున్న నెటిజ‌న్లు..!