Australia New ODI Captain: ఆస్ట్రేలియా వన్డే జట్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్.. ఆ విభాగం నుంచి మొదటి వ్యక్తి అతనే ..
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్‌గా రాణించడంతో వన్డే జట్టుకుసైతం నాయకత్వం వహించే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది.

Australia New ODI Captain Pat Cummins
Australia New ODI Captain: ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. వన్డే జట్టు నూతన కెప్టెన్‌గా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఇప్పటికే టెస్టు కెప్టెన్‌గా పాట్ కమిన్స్ కొనసాగుతున్నారు. టెస్టు కెప్టెన్‌గా రాణించడంతో వన్డే జట్టుకుసైతం నాయకత్వం వహించే బాధ్యతను క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమిన్స్‌ను ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు కమిన్స్ 27వ వన్డే కెప్టెన్. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆసీస్ పురుషుల జట్టుకు సారథ్యం వహించనున్న తొలి ఫాస్ట్ బౌలర్ అతడే కావడం విశేషం. ఇటీవల వరకు వన్డే జట్టుకు కెప్టెన్‌గా అరోన్ ఫించ్ వ్యవహరించాడు. అతను వన్డేల నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం స్వదేశంలో T20 జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు.
పాట్ కమిన్స్ అడిలైడ్ ఓవల్‌లో నవంబర్ 17 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లండ్ సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరిస్తారు. వచ్చే ఏడాది భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌గానూ పాట్ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పాట్ కమిన్స్ మాట్లాడుతూ.. నేను ఫించ్ ఆధ్వర్యంలో ఆడడాన్ని పూర్తిగా ఆస్వాదించాను. అతని నాయకత్వం నుండి అనేక విషయాలను నేర్చుకున్నానని చెప్పాడు.
Pat Cummins has been named Australia's 27th ODI captain ? pic.twitter.com/T0p02wwjiP
— Cricket Australia (@CricketAus) October 17, 2022
వన్డే జట్టు కప్టెన్సీ బాధ్యతలకు క్రికెట్ ఆస్ట్రేలియా పాట్ కమిన్స్ తోపాటు పలువురి పేర్లను పరిశీలించింది. వీరిలో డేవిడ్ వార్నర్ ఉన్నారు. గతవారం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ నిషేధాన్ని ఎత్తివేయడంపై చర్చించారు. అయితే, అదిసాధ్యం కాకపోవటంతో పాట్ కు వన్డే జట్టు కప్టెన్సీ బాధ్యతలు దక్కాయి.