Olympics 2020 : అందరి చూపు సాత్విక్ పైనే..కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్‌

ఒలింపిక్ క్రీడావేదికపై సాత్విక్ సిద్ధమయ్యారు. శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నారు. సాత్విక్ - చిరాగ్ శెట్టిలపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Olympics 2020 : అందరి చూపు సాత్విక్ పైనే..కోనసీమ కుర్రాడికి తొలి మ్యాచ్‌

Satwiksairaj Rankireddy

Updated On : July 24, 2021 / 3:54 PM IST

Badminton Player Satwik : ఒలింపిక్స్ గేమ్స్ స్టార్ట్ అయ్యాయి. వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో భారతదేశానికి చెందిన మీరాబాయి చాను రజత పతకం సాధించారు. ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొని పతకం సాధించాలని ప్రతొక్క క్రీడాకారుడు అనుకుంటారు. అంతేగాకుండా..దేశం తరపున ప్రాతినిథ్యం వహించాలని కలలు కంటుంటారు. ఇలాగే..అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్ సాత్విక్, అతని తల్లిదండ్రులు కూడా కల కూడా అదే.

Read More : Olympics : 20 ఏళ్ల భారత్ నిరీక్షణ… రజతాన్ని ముద్దాడిన మీరాబాయి

మొత్తానికి వారి కలలు ఫలించాయి. ఒలింపిక్ క్రీడావేదికపై సాత్విక్ సిద్ధమయ్యారు. శనివారం బ్యాడ్మింటన్ విభాగంలో డబుల్స్ తొలి లీగ్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో సాత్విక్ ఆడనున్నారు. సాత్విక్ – చిరాగ్ శెట్టిలపై క్రీడాభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎలాగైనా ఈ మ్యాచ్ లో గెలుస్తారని అనుకుంటున్నారు. సాత్విక్ తల్లిదండ్రులు సైతం ఇదే భావనలో ఉన్నారు. సాత్విక్ తన గురువు గోపీచంద్ అకాడమీలో సాధన చేస్తున్నారు. బ్యాడ్మిటన్, ఒలింపిక్స్ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్చంద సంస్థలతో పాటు..ఇక్కడి క్రీడాభిమానులు..బంగారం పతకం సాధించాలని కోరుకుంటున్నారు.

Read More : Mirabai Chanu : పట్టుదలే ఫలితానిచ్చింది, మీరాబాయి చాను గెలిచింది..

ఇక ఇతని రికార్డు విషయానికి వస్తే :-
చిరాగ్‌ శెట్టితో 2016లో మౌరిటీస్‌ ఇంటర్‌ నేషనల్, ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ సిరీస్, టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్ టోర్నీలలో గెలుపందారు సాత్విక్.
అనంతరం 2017లో వియత్నాం ఇంటర్నేషనల్ లో కూడా గెలుపొందారు.
2018లో హైదరాబాద్‌ ఓపెన్, 2018 సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ టోర్నీలో విజయం సాధించారు.

Read More : Tokyo Olympics : ఆర్చ‌రీలో విభాగంలో క్వార్ట‌ర్ ఫైన‌ల్‌,ఎయిర్ పిస్ట‌ల్ లో ఫైన‌ల్‌ కు భారత్ క్రీడాకారులు

2019లో థాయిలాండ్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణపతకాలు సాధించారు.
2019 బ్రెజిల్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలలో విజయం సాధించారు.