IND vs BAN Test Match: 150 పరుగులకే బంగ్లా ఆలౌట్.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం
బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు ఆలౌట్ అయింది.

India vs bangladesh
IND vs BAN Test Match: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ జట్టు భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడవ రోజు 133/8 ఓవర్ నైట్ స్కోరుతో ఆట ఆరంభించిన బంగ్లా బ్యాటర్లు కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టారు. దీంతో 150 పరుగులకు బంగ్లాదేశ్ జట్టు తొలి ఇంన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యి ఫాలోఆన్‌లో పడింది. కానీ, కెప్టెన్ రాహుల్ మాత్రం బంగ్లాకు బ్యాట్ ఇవ్వకుండా టీమిండియానే బ్యాటింగ్‌కు బరిలోకి దిగింది.
India vs Bangladesh: ముగిసిన రెండో రోజు ఆట.. 133 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్
ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 254 పరుగుల భారీ ఆధిక్యంలో ఉన్న టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తొలుత బ్యాటింగ్ తీసుకుంది. వేగంగా 100 నుంచి 150 పరుగులు చేయడం ద్వారా అనంతరం బంగ్లాను బ్యాటింగ్‌కు ఆహ్వానించే అవకాశం ఉంది. దీంతో మరోరోజు మిగిలి ఉండటంతో బంగ్లా బ్యాటర్లపై ఒత్తిడి పెంచి ఆలౌట్ చేయడం ద్వారా మొదటి టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ప్లాన్‌గా తెలుస్తోంది.
https://twitter.com/BCCI/status/1603607239977480192?cxt=HHwWgMDRobuSlMEsAAAA
చటోగ్రామ్‌లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా బ్యాటర్లతో పాటు బౌలర్లు అద్భుతంగా రాణించారు. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 404 భారీ స్కోరును సాధించింది. ఆ తరువాత భారత్ బౌలర్ల దాటికి బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు. వరుసగా పెవిలియన్ బాటపట్టారు. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, సిరాజుద్దీన్ మూడు వికెట్లతో బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపించారు. దీంతో బంగ్లా బ్యాటర్లలో ముష్పీకర్ రహీమ్ చేసిన 28 పరుగులే అత్యధిక స్కోర్.