బంగ్లా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం: తోటి ప్లేయర్‌ని తిట్టాడని సస్పెన్షన్

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫాస్ట్ బౌలర్ షాదత్ హుస్సైన్ ను సస్పెండ్ చేసింది. తన జట్టు సహచరుడైన అరాఫత్ సన్నీను..

బంగ్లా క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం: తోటి ప్లేయర్‌ని తిట్టాడని సస్పెన్షన్

Updated On : November 18, 2019 / 11:56 AM IST

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫాస్ట్ బౌలర్ షాదత్ హుస్సైన్ ను సస్పెండ్ చేసింది. తన జట్టు సహచరుడైన అరాఫత్ సన్నీను..

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఫాస్ట్ బౌలర్ షాదత్ హుస్సైన్ ను సస్పెండ్ చేసింది. తన జట్టు సహచరుడైన అరాఫత్ సన్నీను నోటికొచ్చినట్లు తిట్టాడనే కారణంతో కీలక నిర్ణయం తీసుకుంది. నేషనల్ క్రికెట్ లీగ్ జరుగుతుండగా ఢాకా డివిజన్ వర్సెస్ ఖుల్నా డివిజన్ మ్యాచ్ మధ్యలో ఈ ఘటన జరిగింది. ఫలితంగా హుస్సేన్ ఓ సంవత్సరం పాటు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు  సస్పెండ్ కు గురయ్యాడు. 

ఒకవేళ సస్పెన్షన్ ను  కాదని ఏదైనా ఫార్మాట్ లో ఆడితే 50వేల టాకాలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. వారిద్దరి మధ్య జరిగిన వాదనను మ్యాచ్ రిఫరీ అక్తర్ అహ్మద్ బీసీబీకు లేఖ ద్వారా తెలిపాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంచినా దేశీవాలీ క్రికెట్ లు ఆడుకునేందుకు బీసీబీ అనుమతించింది. హుస్సేన్ కు ఇది కొత్తేం కాదు. 2015లో 11ఏళ్ల చిన్నారితో ఇంటిపని చేయించుకుంటున్నందుకు జైలు శిక్ష కూడా అనుభవించాడు. 

ఇదిలా ఉంటే, టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఇప్పటికే టీ20 సిరీస్ ముగించుకుని టెస్టు సిరీస్ చివరి దశకు చేరుకున్నాయి. భారత్ చేతుల్లో చిత్తుగా షార్ట్ ఫార్మాట్ పరాజయాన్ని మూటగట్టుకున్న బంగ్లా పరువు నిలుపుకోవడానికి మిగిలింది ఒకే ఒక్క టెస్టు. ఈ క్రమంలో రెండో టెస్టును డే అండ్ నైట్ టెస్టుగా ఆడేందుకు ఇరుజట్లు సమ్మతించాయి. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా నవంబరు 22నుంచి 26వ తేదీ వరకూ జరగనుంది.