T20 World Cup Row : బంగ్లాదేశ్ ప్రపంచకప్ వివాదం.. ఇదేం ట్విస్ట్ సామీ.. మీడియాకు చెప్పారు గానీ ఐసీసీకి చెప్పలేదా?
మెగాటోర్నీలో ఆడేది, లేని విషయమై చెప్పాలని బీసీబీకి 24గంటల గడువును ఐసీసీ(T20 World Cup Row ) ఇచ్చిన సంగతి తెలిసిందే.
Bangladesh Fail To Communicate T20 World Cup Stance To ICC As Deadline Ends
T20 World Cup Row : భద్రతా కారణాలను సాకుగా చూపుతూ భారత్‌లో టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కోరింది. అయితే.. బీసీబీ చేసిన విజ్ఞప్తిని బుధవారం ఐసీసీ తిరస్కరించింది. మెగాటోర్నీకి చాలా తక్కువ సమయం ఉందని, భారత్‌లో బంగ్లాదేశ్ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని చెప్పింది. మెగాటోర్నీలో ఆడేది, లేని విషయమై చెప్పాలని బీసీబీకి 24గంటల గడువును ఐసీసీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ గడువు ముగిసినప్పటికి కూడా బీసీబీ తన నిర్ణయాన్ని ఐసీసీకి చెప్పలేదని క్రిక్‌బజ్ తెలిపింది.
కాగా.. ఎట్టి పరిస్థితుల్లో తాము భారత్‌లో ఆడబోమని మీడియా సమావేశంలో బీసీబీ తెలిపింది. బంగ్లాదేశ్ క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. ప్రపంచకప్‌కు అర్హత సాధించడానికి తమ ఆటగాళ్లు ఎంతో కష్టపడ్డారని చెప్పాడు. అయితే.. భారత్‌లో మా భద్రతకు ముప్పు పొంచి ఉంది, మొత్తం జట్టు, విలేకరులు, ఫ్యాన్స్ భద్రతపై నమ్మకం కలగడం లేదని తెలిపాడు. ఐసీసీ ముప్పు అంచనా నివేదిక అయోదయోగ్యంగా లేదని చెప్పాడు. తామింకా ఆశలు వదులుకోలేదన్నాడు.
AFG vs WI : షమర్ హ్యాట్రిక్.. పరువు దక్కించుకున్న వెస్టిండీస్.. మూడో టీ20లో అఫ్గాన్ పై విజయం
టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టు ఆడేందుకు సిద్ధంగా ఉందన్నాడు. భద్రత సమస్యను పరిగణలోకి తీసుకుని శ్రీలంకలో ఆడేలా ఐసీసీ న్యాయం చేస్తుందని ఆశిస్తున్నట్లుగా చెప్పాడు.
ఐసీసీ ఏం చేయనుంది?
ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ నుంచి వైదొలిగినట్లేనని వార్తలు వస్తున్నాయి. బంగ్లా తప్పుకుంటే ఆ స్థానంలో ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్‌కు అవకాశం లభించనుంది. కాగా.. ఈ విషయాన్ని ఐసీసీ అతి త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
