IND vs BAN : బంగ్లాదేశ్‌పై ఓటమి.. అప్పుడు కూడా సరిగ్గా ఇలాగే..
కొలంబో వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా.. ఆసియాకప్ చరిత్రలో భారత్ పై బంగ్లాదేశ్‌కు ఇది రెండో విజయం.

Sachin-Gill
India vs Bangladesh : కొలంబో వేదికగా శుక్రవారం బంగ్లాదేశ్ తో జరిగిన సూపర్-4 మ్యాచ్‌లో భారత జట్టు ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కాగా.. ఆసియాకప్ చరిత్రలో భారత జట్టు బంగ్లాదేశ్ పై ఓడిన చివరి రెండు మ్యాచుల్లో దాదాపుగా ఒకే విధంగా ఓడింది. ఇందుకు సంబంధించిన ఓ పోలిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో 2012లో టీమ్ఇండియాను బంగ్లాదేశ్ మట్టికరించింది. అయితే.. ఈ రెండు మ్యాచుల్లోనూ టీమ్ ఇండియా ఓపెనర్లు శతకాలు చేయడం గమనార్హం. ఆనాడు క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ శతకం సాధించగా నిన్నటి మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీ చేశాడు.
2012లో ఏం జరిగిందంటే..?
బంగ్లాదేశ్‌లోని మీర్పూర్ వేదికగా భారత్, బంగ్లాదేశ్‌లు తలపడ్డాయి. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 11 పరుగులకే ఔట్ అయినప్పటికీ మరో ఓపెనర్ సచిన్ టెండూల్కర్ (114; 147 బంతుల్లో 12 ఫోర్లు, 1సిక్స్) సెంచరీతో చెలరేగాడు. కాగా.. సచిన్‌కు ఇది అంతర్జాతీయ క్రికట్‌లో వందో సెంచరీ కాగా.. వన్డే క్రికెట్‌లో 49వ సెంచరీ. సచిన్‌తో పాటు విరాట్ కోహ్లీ (66), సురేశ్ రైనా (51) అర్థశతకాలతో రాణించడంతో టీమ్ఇండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.
అనంతరం తమీమ్ ఇక్బాల్ (70), జహురుల్ ఇస్లాం (53), నాసిర్ హుస్సేన్ (54), షకీబ్ అల్ హసన్ (49), ముష్ఫికర్ రహీమ్ (46నాటౌట్) లు తలా ఓ చేయి వేయడంతో లక్ష్యాన్ని బంగ్లాదేశ్ నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి 49.2 ఓవర్లలో అందుకుంది.
2023లో..
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. బంగ్లా బ్యాటర్లలో షకీల్ అల్ హసన్ (80; 85 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), తౌహిద్ హృదయ్ (54; 81 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ రెండు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, ప్రసిద్ కృష్ణ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
Ravindra Jadeja : వన్డేల్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. ఎలైట్ లిస్ట్‌లో చోటు..
266 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత 49.5 ఓవర్లలో 259 పరుగులకు ఆలౌటైంది. 6 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లేకున్నా కూడా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (121; 133 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) టీమ్ఇండియాను గెలిపించేందుకు విశ్వప్రయత్నాలు చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికీ కూడా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 61 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. ఆ తరువాత కూడా అదే పట్టుదలను కొనసాగిస్తూ 117 బంతుల్లో శతకం సాధించాడు. వన్డేల్లో గిల్‌కు ఇది వన్డేల్లో 5వ సెంచరీ. ఆఖర్లో అక్షర్ పటేల్ (42; 34 బంతుల్లో 3 ఫోర్లు, 2సిక్సర్లు) రాణించినప్పటికీ భారత్ కు ఓటమి తప్పలేదు.
అప్పుడు సచిన్, ఇప్పుడు గిల్..
కాగా.. ఈ విషయమే ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆసియాకప్ చరిత్రలో భారత జట్టు బంగ్లాదేశ్ పై ఓడిన చివరి రెండు మ్యాచుల్లో దాదాపుగా ఒకే విధంగా ఓడింది. ఈ రెండు మ్యాచుల్లో రెండో స్థానంలో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శతకాలు చేసినప్పటికీ మ్యాచులు ఓడిపోయింది. దీంతో అప్పుడు సచిన్, ఇప్పుడు గిల్ శతకాలు సాధించినా భారత జట్టు ఓడిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.
Virat Kohli : వాటర్ బాయ్‌గా మారిన కోహ్లీ.. వీడియో వైరల్
Bangladesh’s last 2 wins over India in Asia Cup history:
2012 – Sachin Tendulkar scored a century.
2023 – Shubman Gill scored a century. pic.twitter.com/nBgji6Opct
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 15, 2023