T20 World Cup 2026 : ఐసీసీ డెడ్‌లైన్ పై స్పందించిన బంగ్లాదేశ్..
బంగ్లాదేశ్ యువజన, క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ ఐసీసీ డెడ్‌లైన్ గురించి స్పందించాడు.
Bangladesh Responds To ICC dead line On T20 World Cup 2026
T20 World Cup 2026 : టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొంటారా? లేదా ? అనేది తెలియజేసేందుకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు ఐసీసీ జనవరి 21 వరకు గడువు ఇచ్చింది. ఇక ఐసీసీ ఇచ్చిన డెడ్‌లైన్ సమీపిస్తుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ బంగ్లాదేశ్ ఈ టోర్నమెంట్ నుంచి వైదొలిగితే అప్పుడు ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ ఆడే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బంగ్లాదేశ్ యువజన, క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌ను డెడ్‌లైన్ గురించి స్పందించాడు. దేశం తన డిమాండ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదని ఆయన స్పష్టం చేశారు.
తమ జట్టును బహిష్కరించి స్కాట్లాండ్‌ను తీసుకునే అంశం గురించి తమకు తెలియదన్నారు. ఒకవేళ బీసీసీఐ ఒత్తిడి వల్ల ఐసీసీ మాపై ఒత్తిడి తీసుకువచ్చి భారత్‌లో ఆడాలని చెప్పే దానికి అంగీకరించమన్నాడు. భారత జట్టు పాక్ కు వెళ్లేందుకు నిరాకరిస్తే.. అప్పుడు ఐసీసీ వేదికలను మార్చిన విషయాన్ని గుర్తు చేశాడు.
IND vs PAK : క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఒకే రోజు రెండు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్‌లు..
‘అసమంజసమైన, అవాస్తవ ఒత్తిడితో మమ్మల్ని భారతదేశంలో ఆడమని బలవంతం చేయలేరు. వారు (ఐసీసీ) మమ్మల్ని మినహాయించి, బదులుగా స్కాట్లాండ్‌ను తీసుకుంటారని అధికారికంగా వినలేదు. ఒకవేళ బిసిసిఐకి ఐసిసి తలొగ్గి మాపై ఒత్తిడి తెస్తే.. వారు అవాస్తవ డిమాండ్లు పెడితే, మేము అంగీకరించము. భారతదేశం.. పాకిస్తాన్‌కు వెళ్లడానికి నిరాకరించిన ఉదాహరణలు ఉన్నాయి. అప్పుడు ఐసిసి వేదికను మార్చింది. తార్కిక కారణం కోసం మేము వేదిక మార్పును కోరాము. అనవసరమైన, అసమంజసమైన ఒత్తిడిని తీసుకురావడం ద్వారా వారు మమ్మల్ని భారతదేశంలో ఆడమని బలవంతం చేయలేరు. ‘అని నజ్రుల్ మంగళవారం విలేకరుల సమావేశంలో అన్నారు.
ఐపీఎల్‌లో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ విడుదల చేయడంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. భద్రతా కారణాల దృష్ట్యా భారత్‌లో తమ జట్టు ఆడే మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) పలుమార్లు కోరింది. కాగా.. బీసీబీ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. ప్రపంచకప్ ప్రారంభానికి నెలరోజుల కంటే చాలా తక్కువ సమయం ఉండడంలో ఇప్పుడు వేదికలను మార్చలేమని స్పష్టం చేసింది.
IND vs NZ : భారత్‌తో టీ20 సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. ఆనందంలో టీమ్ఇండియా!
బంగ్లా క్రికెట్ బోర్డు మెట్టు దిగకపోవడంతో శనివారం డాకా వేదికగా బీసీబీతో ఐసీసీ చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే భారత్‌కు తమ జట్టును పంపేది, లేదు అనే విషయమై స్పష్టమైన వైఖరి తెలపాలని బీసీబీకి ఐసీసీ డెడ్‌లైన్ విధించింది.
ఫిబ్రవరి 7 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. ఇటలీ, న్యూజిలాండ్, వెస్టిండీస్, నేపాల్‌లతో కలిసి బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. గ్రూపు దశలో కోల్‌కతా వేదికగా బంగ్లాదేశ్ మూడు మ్యాచ్‌లు ఆడనుంది. ముంబైలోని వాంఖడే వేదికగా ఓ మ్యాచ్ ఆడనుంది.
