హైదరాబాద్‌లో 7 ఐపీఎల్ మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..

అహ్మదాబాద్, చెన్నై వేదికగా క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగనున్నాయి. చెన్నై వేదికగా మే26న ఐపీఎల్ ఫైనల్..

హైదరాబాద్‌లో 7 ఐపీఎల్ మ్యాచ్‌లు.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..

IPL 2024

ఐపీఎల్-2024 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ విడుదల చేసింది. హైదరాబాద్‌లో మొత్తం 7 ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. అహ్మదాబాద్, చెన్నై వేదికగా క్వాలిఫయర్, ఎలిమినేటర్ మ్యాచ్ లు జరగనున్నాయి. చెన్నై వేదికగా మే26న ఐపీఎల్ ఫైనల్ జరగనుంది.

ఐపీఎల్-2024 మార్చి 22న ప్రారంభమైనవిషయం తెలిసిందే. ఇంతకుముందు తొలి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ ప్రకటించింది. భారత్‌లో ఎన్నికలు ఉండడంతో రెండో షెడ్యూల్ ప్రకటించలేదు. రెండో షెడ్యూల్లో మ్యాచులను విదేశాల్లో నిర్వహిస్తారని ప్రచారం జరిగింది. మన దేశంలోనే అన్ని మ్యాచులనూ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది.

హైదరాబాద్‌లో జరిగే మ్యాచులు

  • ఈనెల 27న ముంబై vs హైదరాబాద్
  • ఏప్రిల్ 5న చెన్నై vs హైదరాబాద్
  • ఏప్రిల్ 25న బెంగుళూరు vs హైదరాబాద్
  • మే 2న రాజస్థాన్ vs హైదరాబాద్
  • మే 8న లక్నో vs హైదరాబాద్
  • మే 16న గుజరాత్ vs హైదరాబాద్
  • మే 19న పంజాబ్ vs హైదరాబాద్

ప్లేఆఫ్స్‌..
క్వాలిఫయర్‌-1 మే 21న అహ్మదాబాద్‌లో
ఎలిమినేటర్‌ మ్యాచ్‌ మే 22న అహ్మదాబాద్‌లో
క్వాలిఫయర్‌-2 మే 24న చెన్నైలో
ఫైనల్‌ మ్యాచ్ మే 26న చెన్నైలో

పూర్తి షెడ్యూల్..

Also Read: శుభ్‌మన్ గిల్ తండ్రి, సోదరి ఎమోషనల్.. హగ్ చేసుకుని, ముద్దు పెట్టి..