తొక్కిసలాట ఘటన ఎఫెక్ట్.. బీసీసీఐ కీలక నిర్ణయం.. IPL 2026లో ఆర్సీబీపై నిషేదం..?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.

IPL 2026 RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందా..? అంటే అవునే సమాధానం వినిపిస్తోంది. తొక్కిసలాట ఘటనపై సీరియస్ గా ఉన్న బీసీసీఐ.. ఐపీఎల్ -2026 సీజన్ కు ఆర్‌సీబీ జట్టుపై నిషేధం విధించాలని నిర్ణయం తీసుకోబోతుందని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. త్వరలో ఆ మేరకు ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న వార్తలు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
Also Read: గుడ్ బై RR.. ఛలో CSK..! చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి సంజు శాంసన్..?
ఐపీఎల్ ప్రారంభమైన నాటినుంచి తొలిసారి ఆర్సీబీ జట్టు ఐపీఎల్-2025 సీజన్లో ట్రోఫీని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ దేశవ్యాప్తంగా పెద్దెత్తున సంబరాలు చేసుకున్నారు. తొలిసారి టైటిల్ గెలిచిన సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయోత్సవ పరేడ్, గ్రాండ్ వేడుకలకు సన్నాహాలు చేసింది. ఈ క్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 50మందికిపైగా గాయాలపాలయ్యారు.
ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది. న్యాయ విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ ఘటన తరువాత కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఎ.శంకర్, కోశాధికారి ఇ.ఎస్. జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. ఆర్సీబీ యాజమాన్యం, కేఎస్‌సీఏ అధ్యక్షుడు రఘురామ్ భట్, ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ డీఎన్‌ఏ ఎంటర్‌టైన్‌మెంట్‌ను బాధ్యులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. పలు అరెస్టులు సైతం జరిగాయి.
ఈ ఘటనపై బీసీసీఐ సీరియస్ గా ఉంది. ఆర్సీబీదే తప్పని తేలితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ క్రమంలో ఆర్సీబీదే తప్పని తేలితే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా బీసీసీఐ ఒక ఏడాది పాటు ఆ జట్టుపై నిషేధం విధించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్పందించారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బీసీసీఐ చూస్తూ ఊరుకుండలేదని తేల్చి చెప్పారు. విచారణ పూర్తి అయిన తర్వాత ఏదో ఒక నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
తొక్కిసలాట ఘటనపై విచారణలో ఆర్సీబీ యాజమాన్యం తప్పిందం ఉందని తేలితే బీసీసీఐ ఏడాది పాటు ఆ జట్టుపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనుకాడదని, ఇప్పటికే ఆ మేరకు బీసీసీఐలో అంతర్గతంగా చర్చలుసైతం జరిగాయిని క్రికెట్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. తాజా పరిణామాలు ఆర్సీబీ ఫ్యాన్స్ ను ఆందోళనకు గురిచేస్తున్నాయి.