AIFF Election: మంత్రి వచ్చి ఓటర్లందరినీ తీసుకెళ్లారు.. ఏఐఎఫ్ఎఫ్ ఎన్నికపై లెజెండరీ ఫుట్‌బాలర్ షాకింగ్ కామెంట్స్
ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో లెజెండరీ ఫుట్‌బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు ఒక ఆటగాడు అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి

Bhutia on AIFF elections says Minister came to hotel and took voters to 1 floor till 2 am
AIFF Election: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఎన్నికపై టీంఇండియా మాజీ కెప్టెన్, లెజెండరీ ఫుట్‌బాలర్ బైచుంగ్ భూటియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎన్నికలో పెద్ద ఎత్తున రాజకీయం ప్రవేశించిందని, ఒక మంత్రి ఓటర్లందరినీ తీసుకెళ్లారంటూ భూటియా ఆరోపించారు. హోటల్లో ఉన్న ఓటర్లందరినీ మొదటి అంతస్తుకి తీసుకెళ్లి.. వారితో అర్థరాత్రి 2 వరకు సదరు మంత్రి ఉన్నారని అన్నారు. ఆ మర్నాడే ఏఐఎఫ్ఎఫ్ ఎన్నిక జరిగిందని అన్నారు. క్రీడా ఎన్నికల్లో ఇంత పెద్ద ఎత్తున రాజకీయ ప్రమేయంపై భూటియా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా మాజీ ఫుట్‌బాల్ కల్యాణ్ చౌబే ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో లెజెండరీ ఫుట్‌బాలర్ భైచుంగ్ భూటియాను ఆయన 33-1 తేడాతో ఓడించారు. కాగా, 85 ఏళ్ల చరిత్రలో ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్‌కు ఒక ఆటగాడు అధ్యక్షుడు అవ్వడం ఇదే తొలిసారి. 45 ఏళ్ల కల్యాణ్ చౌబే.. తూర్ప్ బెంగాల్‌కు గోల్ కీపర్‌గా ఆడారు. ఇక ఫుట్‌బాల్ ఇండియా టీంకు మాజీ కోచ్ అయిన భూటియా 34 ఓట్లలో కేవలం ఒకటంటే ఒక ఓటు మాత్రమే సాధించడం గమనార్హం.
2002 Gujarat riots case: జైలు నుంచి విడుదలైన తీస్తా సెతల్వాద్