Yuzvendra Chahal – Dhanashree Verma : ఇన్‌స్టాలో అన్‌ఫాలో.. ఫోటోలు డిలీట్.. విడిపోనున్న చాహల్, ధనశ్రీవర్మ..!
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధన శ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Chahal And Dhanashree Verma Delete Photos And Unfollow Each Other On Instagram
టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, ఆయన భార్య ధన శ్రీ వర్మ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాదండోయ్.. చాహల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధన శ్రీతో ఉన్న ఫోటోలను చాలా వరకు డిలీట్ చేశాడు. దీంతో వీరిద్దరు వీడిపోనున్నారు అనే వార్తలకు బలం చేకూరుతోంది. అయితే.. ధనశ్రీ వర్మ మాత్రం చాహల్‌తో కలిసి ఉన్న ఫోటోలను తొలగించలేదు.
వీరిద్దరు ఖచ్చితంగా విడిపోతారని, త్వరలోనే విడాకులు తీసుకోనున్నారని, ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించేందుకు కొంత సమయం పడుతుందని సన్నిహిత వర్గాలు చెప్పినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే.. వారిద్దరు ఎందుకు విడిపోతున్నారో అనే కారణాలు మాత్రం తెలియరానుట్లు పేర్కొన్నాయి.
2023లో తొలిసారి చాహల్, ధనశ్రీలు విడిపోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కొత్త లైఫ్ ప్రారంభం కాబోతుందని చాహల్ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకురాగా.. ధన శ్రీ తన పేరు నుంచి చాహల్‌ను తొలగించింది. అప్పటి నుంచి విడాకుల రూమర్లు ప్రారంభం అయ్యాయి. అయితే.. ఓ సందర్భంగా చాహల్ వీటికి పుల్ స్టాప్ పెట్టేశాడు. అవన్నీ ఫేర్ వార్తలు అన్నాడు. తామిద్దరం కలిసే ఉంటామన్నాడు. ప్రస్తుతం ఇద్దరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడంతో మరోసారి విడాకుల వార్తలు తెరపైకి వచ్చాయి.
Rishabh Pant : పంత్ కాక.. టెస్టు అనుకున్నావా.. టీ20 అనుకున్నావా.. ఆ కొట్టుకు ఏందీ సామీ..
ముంబైకి చెందిన ధనశ్రీ వర్మ డెంటిస్ట్, కొరియోగ్రాఫర్. ఆమె వద్ద డ్యాన్స్ క్లాసులకు వెళ్లేవాడు చాహల్. అలా వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2020 డిసెంబర్ 11న వీరిద్దరు వివాహా బంధంతో ఒక్కటి అయ్యారు.