Champions Trophy Final: 25యేళ్ల తరువాత మళ్లీ..! అప్పుడు గంగూలీ.. ఇప్పుడు రోహిత్.. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ కు ఇండియా, న్యూజిలాండ్ జట్లు చేరాయి. అయితే, ఈ రెండు జట్లు 25ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి.

Champions Trophy 2025 Final
Champions Trophy Final IND vs NZ : ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి దశకు చేరింది. సెమీ ఫైనల్స్ మ్యాచ్ లలో విజేతలుగా నిలిచిన ఇండియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్స్ కు చేరుకున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్ లో దక్షిణాఫ్రికా జట్టుపై న్యూజిలాండ్ 50 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఆల్ రౌండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన కివీస్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు దూసుకెళ్లింది. న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో అదరగొట్టారు. దక్షిణాఫ్రికా జట్టులో మిల్లర్ (100 నాటౌట్) సెంచరీ చేసినప్పటికీ జట్టును విజయతీరాలకు చేర్చలేక పోయాడు. అయితే, ఈనెల 9న దుబాయ్ వేదికగా జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి.
25ఏళ్ల తరువాత..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ కు ఇండియా, న్యూజిలాండ్ జట్లు చేరాయి. అయితే, ఈ రెండు జట్లు 25ఏళ్ల తరువాత ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో తలపడుతున్నాయి. 2000 సంవత్సరంలో కెన్యాలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్, భారత్ జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. అప్పుడు భారత్ జట్టు కెప్టెన్ గా సౌరవ్ గంగూలీ ఉన్నారు. సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, రాహుల్ ద్రవిడ్, అజిత్ అగార్కర్, అనిల్ కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు అప్పటి జట్టులో ఉన్నారు. అయితే, అప్పట్లో భారత్ జట్టు ఓటమి పాలైంది.
Also Read: Gautam Gambhir : టీమ్ఇండియా దుబాయ్ అడ్వాంటేజ్.. సెమీస్ మ్యాచ్ తరువాత అగ్గిమీద గుగ్గిలమైన గంభీర్..
గంగూలీ సెంచరీ..
2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగులు చేసింది. కెప్టెన్ గంగూలీ 117 పరుగులతో సెంచరీ చేశాడు. సచిన్ టెండూల్కర్ 69 పరుగులు సాధించారు. వీరిద్దరూ మొదటి వికెట్ కు 141 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు భారత్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఇంకా రెండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ ప్లేయర్ క్రిస్ కైర్న్స్ 102 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు.
Also Read: Team India : టీమ్ఇండియా ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఐసీసీ ఈవెంట్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుందో తెలుసా?
రోహిత్ సేన ప్రతీకారం తీర్చుకుంటుందా..?
మార్చి9న జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్, ఇండియా జట్లు తలపడనున్నాయి. అయితే, 25ఏళ్ల క్రితం ఆడిన ఫైనల్ మ్యాచ్ కు ప్రతీకారం తీర్చుకోవడానికి టీమిండియాకు మంచి అవకాశం లభించినట్లయింది. ప్రస్తుతం ఇరు జట్ల ఆటగాళ్లు ఫుల్ ఫాంలో ఉన్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. ఈ టోర్నీలోనే లీగ్ దశలో కివీస్ ను భారత్ జట్టు ఓడించిన విషయం తెలిసిందే. ఫైనల్ లోనూ కివీస్ జట్టును ఓడించాలంటే రోహిత్, కోహ్లీ, గిల్ వంటి ప్లేయర్లు క్రీజులో పాతుకుపోయి పరుగుల వరద పారించాల్సిందే. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతుందనడంలో ఎలాంటి సదేహం లేదు. ఎందుకంటే ఇరు జట్ల ప్లేయర్లు ఫుల్ ఫామ్‌లో ఉన్నారు.
– Champions Trophy Final. 🏆
– India Vs New Zealand. 🇮🇳🇳🇿
– 9th March, 2.30pm. 🗓️
– Dubai Stadium. 🏟️IT’S THE ULTIMATE BATTLE – ROHIT SHARMA VS MITCHELL SANTNER. 🔥 pic.twitter.com/UEbw9d1tVd
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025