Gautam Gambhir : టీమ్ఇండియా దుబాయ్ అడ్వాంటేజ్.. సెమీస్ మ్యాచ్ తరువాత అగ్గిమీద గుగ్గిలమైన గంభీర్..
భారత్ దుబాయ్ అడ్వాంటేజీ పై గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు.

Gautam Gambhir blasts critics on Indias Dubai advantage
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భారత్ వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకువెళ్లింది. సెమీస్‌లో ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది. కాగా.. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ దుబాయ్ వేదికగానే అన్ని మ్యాచ్‌ల్లోనూ ఆడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అక్కసును వెళ్లగక్కారు. భారత్ పై విమర్శలు చేశారు.
ఎలాంటి ప్రయాణాలు చేయకుండా , ఒకే చోట ఉండడం వల్ల టీమ్ఇండియాకు అదనపు ప్రయోజనం చేకూరుతోందని మండిపడ్డాడు. తాజాగా ఇలాంటి వ్యాఖ్యలపై ఆసీస్ పై గెలిచిన తరువాత టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తొలిసారి స్పందించాడు.
Team India : టీమ్ఇండియా ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఐసీసీ ఈవెంట్స్‌లో ఫైనల్స్‌కు చేరుకుందో తెలుసా?
దుబాయ్ వేదికగా హోం గ్రౌండ్ కాదన్నాడు. మిగిలిన జట్ల లాగే తమకు ఇక్కడ అంతా కొత్తేనని చెప్పాడు. ఇక్కడ చివరి సారిగా ఎప్పుడు ఆడామో కూడా గుర్తు లేదన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆరంభ మ్యాచ్ నుంచి తాము ప్రణాళికా బద్ధంగా ఆడుతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
Gautam Gambhir said, “what undue advantage we have? We haven’t practiced here for one day. We’re practicing at the ICC Academy where conditions are 180° different. Some people are just perpetual cribbers. They’ve got to grow up”. pic.twitter.com/TZW9OAcOy2
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025
తుది జట్టులో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లను తీసుకోవాలని భావించామని, అందుకు తగ్గట్టుగానే ముందుకు సాగుతున్నాం అని తెలిపాడు.
దుబాయ్ పిచ్ మాకు అడ్వాంటేజ్ అని ఎలా చెప్పగలరని ప్రశ్నించాడు. తాము ఇక్కడేమీ ప్రాక్టీస్ చేయలేదని తెలిపాడు. ఐసీసీ అకాడమీలో సాధన చేశామని, అక్కడికి, దుబాయ్ మైదానంలోని పరిస్థితులకు చాలా తేడా ఉందన్నాడు. ఇక కొంత మంది ఎప్పుడు విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించాడు.