ఐపీఎల్ క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు జరిగేది అక్కడేనా?

ఐపీఎల్ క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లు జరిగేది అక్కడేనా?

IPL 2024 Final: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ మార్చి 22న ప్రారంభమైంది. మే 26 వరకు ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది. సెకండాఫ్ షెడ్యూల్‌ను ఇంకా ప్రకటించలేదు. మిగతా మ్యాచ్‌ల షెడ్యూల్ తో పాటు నాకౌట్, ఫైనల్ మ్యాచ్ వేదికల గురించి అధికారిక ప్రకటన రావాల్సివుంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సెకండాఫ్ షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లను విదేశాల్లో నిర్వహిస్తారన్న ఊహాగానాలు కూడా వచ్చాయి.

క్రిక్‌బజ్ సమాచారం ప్రకారం.. ఐపీఎల్ మ్యాచ్‌ల‌న్నీ ఇక్కడే జరుగుతాయి. 74 మ్యాచ్‌ల‌నూ ఇండియాలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్టు సమాచారం. ఫైనల్ మాత్రం ఈసారి చెన్నై చెపాక్ స్టేడియంలో జరుగుతుందని తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయి. క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచ్‌లకు చెపాక్ స్టేడియం వేదిక కానుంది. మే 26న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.

ధోని కోసమేనా?
స్టార్ ప్లేయర్ ఎంఎస్ ధోని కోసమే ఫైనల్ చెన్నైలో పెడుతున్నారన్న వాదన వినిపిస్తోంది. ధోనికి ఇది చివరి ఐపీఎల్ అని, అందుకే సీఎస్కే హోంగ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారని ప్రచారం జరుగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ సొంత వేదికపై ఓపెనింగ్ గేమ్, ఫైనల్‌ను నిర్వహించే సంప్రదాయాన్ని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ అనుసరిస్తోందని.. ఇప్పుడు కూడా దాన్నే కొనసాగించనుందని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పీటీఐతో అన్నారు.

Also Read: స్టేడియంలో కొట్టుకుంది రోహిత్, హార్ధిక్ ఫ్యాన్సేనా..! అసలు విషయం ఏమిటంటే?

త్వరలోనే సెకండాఫ్ షెడ్యూల్
దేశ్యాప్తంగా ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఆయా రోజుల్లో మ్యాచ్‌లు లేకుండా సెకండాఫ్ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ షెడ్యూల్ ప్రకటించే అవకాశముందని పీటీఐ తెలిపింది.

Also Read: రోహిత్ శర్మ నామస్మరణతో హోరెత్తిన స్టేడియం.. హార్థిక పాండ్యా ఏం చేశాడంటే? వీడియోలు వైరల్