కోహ్లీ రికార్డు బద్దలుకొట్టిన గేల్

ఐపీఎల్ అంటేనే రికార్డుల మోత. బౌండరీల వర్షం కురిసే మైదానాల్లో బ్యాట్స్‌మెన్ పేర్లతో మార్మోగిపోయే స్టేడియాల్లో రికార్డులు బద్దలవడానికి ఐపీఎల్ చక్కని వేదిక. అంతర్జాతీయ క్రికెటర్లతో జరుగుతోన్న ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో గేల్ మరో రికార్డు బద్దలు కొట్టాడు.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న గేల్.. జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుపై విరుచుకుపడ్డాడు. 47 బంతుల్లో 79 పరుగులు చేసి రాయల్స్ జట్టుకు వణుకు పుట్టించాడు. 13 ఫోర్లు, 17 సిక్సులతో చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ సందర్భంగా గేల్ 4వేల పరుగుల రికార్డు బద్దలు కొట్టాడు.
ఈ రికార్డును త్వరగా బద్దలు కొట్టిన విదేశీ ప్లేయర్లలో మొదటి స్థానంలో గేల్ నిలిచాడు. ఇంతకుముందు ఇదే ఘనత సాధించిన విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ ల రికార్డులు రాజస్థాన్ వేదికగా తుడిచిపెట్టేశాడు. డేవిడ్ వార్నర్(114 ఇన్నింగ్స్‌లు)ఆడి 4014 పరుగులు చేయగలిగితే.. 113 ఇన్నింగ్స్‌లలోనే 4వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు.
ఇప్పటికే ఐపీఎల్ 4వేల పరుగుల క్లబ్‌లో విరాట్ కోహ్లీ(128), సురేష్ రైనా(140), రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప, గౌతం గంభీర్, శిఖర్ ధావన్, మహేంద్ర సింగ్ ధోనీలు ఈ జాబితాలో ఉన్నారు.