రికార్డుల వర్షం: ఒకే మ్యాచ్‌లో గేల్ సృష్టించిన అద్భుతాలు

రికార్డుల వర్షం: ఒకే మ్యాచ్‌లో గేల్ సృష్టించిన అద్భుతాలు

Updated On : February 28, 2019 / 12:07 PM IST

వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయి తన అంతర్జాతీయ క్రికెట్‌లో మైలురాయిని దాటేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన 4వ వన్డే మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదు చేశాడు. ఈ సిరీస్‌లో వరుసగా 135, 50, 162 పరుగులు సాధించిన క్రిస్ గేల్.. బుధవారం సెయింట్ జార్జ్‌లోని నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన నాలుగో వన్డేలోనూ చెలరేగిపోయాడు. కేవలం 97 బంతుల్లో 162 పరుగులు సాధించాడు. 
Read Also : ఇమ్రాన్ ఖాన్ ప్రశ్న : 19ఏళ్ల యువకుడు మానవబాంబుగా ఎందుకు మారాడు

ఈ మ్యాచ్‌లో గేల్ 14 సిక్సులు, 11 ఫోర్లు బాదాడు. ఈ 14 సిక్సులతో కలుపుకుని ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో గేల్ బాదిన సిక్సుల సంఖ్య 506కు చేరింది. 39 ఏళ్ల గేల్.. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో 500సిక్సులు బాదిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ క్రమంలో పాక్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రీది రికార్డును సైతం తుడిచిపెట్టేశాడు. కేవలం 55 బంతుల్లో సెంచరీ నమోదు చేసి వన్డే కెరీర్లో 25వ సెంచరీ చేయగలిగాడు. దాంతో 10వేల పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. 
Read Also : బీసీసీఐ వార్నింగ్ : ఐపీఎలా.. పీఎస్ఎలా.. ఏదో ఒకటి తేల్చుకోండి

ఈ ఘనతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మోసేస్తూ.. ట్వీట్ చేసింది. ‘గేల్ పాజీ.. నువ్వు గ్రేట్’ అని పేర్కొంది. 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న గేల్.. ఈ జాబితాలో రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అగ్రస్థానంలో బ్రియాన్ లారా (10,405) ఉండగా ఈ ఘనత సాధించిన 14వ క్రికెటర్‌గా గేల్ (10,074) నిలిచాడు. 
Read Also : ద్రవిడ్ సలహాలే ఫామ్‌ను తెచ్చిపెట్టాయి: కేఎల్ రాహల్