CSKvDC: ఢిల్లీ ఢమాల్.. కెప్టెన్ కూల్ ముగించాడు

ఢిల్లీ వర్సెస్ చెన్నై హోరాహోరీ మ్యాచ్‌లో సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని చేజిక్కించుకుంది. ఢిల్లీ తరహాలో దూకుడుగా ఓపెనింగ్ చేసిన చెన్నై.. ఆచితూచి అడుగులేసింది. మరో సారి గేమ్ ఫినిషర్ గా ధోనీ చక్కటి ముగింపునిచ్చాడు. దీంతో చెన్నై లీగ్‌లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ముందుగా ఓపెనింగ్ చేసిన షేన్ వాట్సన్ దూకుడైన బ్యాటింగ్ తీరుతో (44 ;26బంతుల్లో 4ఫోర్లు, 3 సిక్సుల) స్కోరును పరుగులు పెట్టించాడు. అంబటి రాయుడు 5పరుగులకే పరిమితమవగా సురేశ్ రైనా(16 బంతుల్లో 30), కేదర్ జాదవ్(27)బాదాడు. ఆ తర్వాత చివరి వరకూ క్రీజులో నిలిచిన ధోనీ(32), బ్రావో(4)లు మ్యాచ్ ను ముగించారు.
పృథ్వీ షా(24), ధావన్(51) చక్కటి ఓపెనింగ్ ఇచ్చారు. అంత దూకుడుగా మొదలైన ఇన్నింగ్స్‌ను ధావన్, శ్రేయాస్ అయ్యర్(18)లు పరవాలేదని పించారు. ఓపెనర్ గా దిగిన ధావన్ 17.1ఓవర్ల వరకూ క్రీజులో నిలదొక్కుకుని వికెట్లు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. రిషబ్ పంత్ 13 బంతుల్లో 25పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ఇంగ్రామ్(2), పాల్(0), అక్సర్ పటేల్(9),రాహుల్ తివాతియా(11)లు సరిపెట్టుకున్నారు.
చెన్నై బౌలర్లు ఆరంభంలో తడబడినా.. ఆఖర్లో అందుకుని దీపక్ చాహర్(1), రవీంద్ర జడేజా(1), ఇమ్రాన్ తాహిర్(1), డేన్ బ్రావో(3)వికెట్లు తీయగలిగారు.