CSKvsSRH: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ సొంతగడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన సూపర్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైను చిత్తుగా ఓడించిన హైదరాబాద్ మరోసారి అదే పునరావృతం చేయాలని భావిస్తోంది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్ వైఫల్యం అనంతరం విజయం కోసం సూపర్ కింగ్స్ తహతహలాడుతోంది.
మ్యాచ్ ఆరంభానికి ముందే హైదరాబాద్ కెప్టెన్ విలియమ్సన్ వ్యక్తిగత కారణాల రీత్యా ఇంగ్లాండ్ తిరిగి వెళ్లిపోయాడు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా భువనేశ్వర్ కుమార్ కెప్టెన్సీ వహించనున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్:
షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోనీ, డేన్ బ్రావో, రవీంద్ర జడేజా, దీపక్ చాహర్, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్
సన్‌రైజర్స్ హైదరాబాద్:
డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, మనీశ్ పాండే, విజయ్ శంకర్, షకీబ్ అల్ హసన్, యూసఫ్ పఠాన్, దీపక్ హుడా, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
Also Read : జీవితాంతం ఐపీఎల్లో ఆర్సీబీకే ఆడతా- చాహల్