David Warner : షేన్‌వార్న్ అంత్యక్రియలకు డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు కష్టమే..!

David Warner : ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలకు తప్పక హాజరు కావాలని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించాడు.

David Warner : షేన్‌వార్న్ అంత్యక్రియలకు డేవిడ్ వార్నర్.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు కష్టమే..!

David Warner Hopes To Attend Shane Warne's Funeral After Pakistan Tests He Will Be Dearly Missed (1)

Updated On : March 10, 2022 / 10:35 PM IST

David Warner : ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్ అంత్యక్రియలు మార్చి 30న మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరుగనున్నాయి. ఈ మేరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక ప్రకటనలో వెల్లడించింది. స్పిన్ మాంత్రికుడికి తుది వీడ్కోలు పలికేందుకు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు సుమారుగా లక్ష మంది వరకు అభిమానులు తరలిరానున్నారు. అభిమానుల మధ్య షేన్ వార్న్ తుది వీడ్కోలు పలుకనున్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను రెడీ చేస్తోంది. అయితే షేన్ వార్న్ అంత్యక్రియలకు తప్పక హాజరు కావాలని ఆస్ట్రేలియా ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ డిసైడ్ అయ్యాడు. అతనే స్వయంగా ప్రకటించాడు కూడా. ప్రస్తుతం వార్నర్ పాక్ పర్యటనలో ఉన్నాడు.

టెస్ట్‌ సిరీస్‌ ముగిసిన వెంటనే అభిమాన క్రికెటర్‌ తుది వీడ్కోలు కార్యక్రమానికి హాజరుకానున్నట్టు ముందుగానే చెప్పేశాడు. పాకిస్తాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ మార్చి 25తో ముగియనుంది. మార్చి 30న షేన్ వార్న్ అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున డేవిడ్ వార్నర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మార్చి 30 వరకు వార్నర్ అందుబాటులో ఉండే అవకాశం లేదు. దాంతో ఢిల్లీ జట్టులో ఆందోళన మొదలైంది. వార్నర్ లేని లోటు ఢిల్లీపై ప్రభావం పడనుంది. వార్నర్ ఆస్ట్రేలియా వెళ్లనుండటంతో ఢిల్లీతో జరిగే కొన్ని మ్యాచ్‌లకు అతడు దూరమయ్యే అవకాశం ఉంది. ఐసీసీ షెడ్యూల్ ప్రకారం.. అదే తేదీన పాక్ పర్యటనలో ఉండాల్సి ఉంది. ఏప్రిల్ 6 వరకు పాక్ పర్యటన కొనసాగనుంది. ఎందుకంటే వన్డే సిరీస్‌లో 3 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాల్సి ఉంది.

David Warner Hopes To Attend Shane Warne's Funeral After Pakistan Tests He Will Be Dearly Missed

Hopes To Attend Shane Warne’s Funeral After Pakistan Tests He Will Be Dearly Missed

ఈ మ్యాచ్ ల్లో తాను ఆడబోనని ఇదివరకే వార్నర్ ప్రకటించాడు. ఐపీఎల్ మ్యాచ్ ల్లో పాల్గొనాలనే ఉద్దేశంతోనే వార్నర్ ఆసీస్ క్రికెట్ బోర్డు నుంచి స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకున్నాడు. ఏదిఏమైనా ఢిల్లీకి కొన్ని మ్యాచ్ ల వరకు వార్నర్ లేని లోటు కనిపించే అవకాశం ఎక్కువగా ఉంది. ఐపీఎల్ మెగా వేలంలో ఢిల్లీ జట్టు వార్నర్‌ను రూ. 6.5 కోట్లకు దక్కించుకుంది. ఇదిలా ఉండగా.. పాక్ పర్యటనతో ఆసీస్ ఆటగాళ్లు మరికొంతమంది ఐపీఎల్‌ 2022 ప్రారంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌ 6తో పాక్‌ సిరీస్‌ ముగియనుంది. క్వారంటైన్ నిబంధనల కారణంగా మరో వారం రోజులు బెంచ్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. అప్పటికే దాదాపు 25 మ్యాచ్‌లు అయిపోతాయి. ఆ తర్వాతే వార్నర్ సహా ఆసీస్ ఆటగాళ్లు తమ జట్లకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

Read Also :  Shane Warne funeral : మార్చి 30న MCG వేదికగా స్పిన్ మాంత్రికుడు షేన్‌వార్న్ అంత్యక్రియలు..!