DCvsMI: భీకరపోరులో ముంబై ఘన విజయం

DCvsMI: భీకరపోరులో ముంబై ఘన విజయం

ముంబై బ్యాట్స్ మెన్ నిర్దేశించిన టార్గెట్ చేధించలేని ఢిల్లీ.. మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. లక్ష్యం అందుకోవడానికి ఇంకా 40 పరుగులు మిగిలి ఉన్నప్పటికీ ఆల్ అవుట్ కావడంతో ఓటమిని తప్పించుకోలేకపోయింది. 169 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఓపెనర్లు పృథ్వీ షా(29), శిఖర్ ధావన్(35)మాత్రమే చేసి 8.3ఓవర్లకే పెవిలియన్ చేరుకున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వరుస వికెట్లు కోల్పోతూ వచ్చింది.

కొలిన్ మన్రో(3), శ్రేయాస్ అయ్యర్(3), రిషబ్ పంత్(7) స్వల్ప స్కోరుకే కుప్పకూలారు. ఆ తర్వాత బ్యాటింగ్ దిగిన అక్సర్ పటేల్(26) మెరిసినప్పటికీ 17.2 ఓవర్ల వద్ద బుమ్రా బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రిస్ మోరిస్(11), కీమో పాల్(0), కగిసో రబాడ(9), అమిత్ మిశ్రా(6), ఇషాంత్ శర్మ(0)మాత్రమే చేయగలిగారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ 5 వికెట్లు నష్టపోయి ఢిల్లీకి 169 పరుగుల టార్గెట్ నిర్దేశించారు. ఓపెనర్లుగా క్రీజులోకి దిగిన రోహిత్ శర్మ(30) 6.1 ఓవర్ల వద్ద మిశ్రా బౌలింగ్ లో అవుట్ అయి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ డికాక్(35)పరుగులు చేసి రనౌట్ గా ముగించాడు. బెన్ కట్టింగ్(2)పరుగులతో నిరాశపర్చగా సూర్య),  కుమార్ యాదవ్(26) 15.1ఓవర్ల వరకూ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించి రబాడ్ బౌలింగ్ లో పంత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 

ఆ తర్వాత కృనాల్(37)తో కలిసి హార్దిక్ పాండ్యా(32)చెలరేగడంతో జట్టు స్కోరు 168 పరుగులకు చేరింది. 20ఓవర్లు పూర్తవడానికి ఇంకా 3 బంతుల ముందే హార్దిక్ అవుటవడంతో క్రీజులోకి వచ్చిన కీరన్ పొలార్డ్ సున్నా పరుగులకే పరిమితమైయ్యాడు. ఢిల్లీ బౌలర్లలో రబాడ 2వికెట్లు తీయగా, అమిత్ మిశ్రా, అక్సర్ పటేల్ చెరో వికెట్ తీయగలిగారు.