DCvsRCB: పరవాలేదనిపించిన బెంగళూరు బ్యాటింగ్, ఢిల్లీ టార్గెట్ 150

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్లు నష్టపోయి ఢిల్లీ క్యాపిటల్స్ కు 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ తీవ్రంగా కట్టడి చేసింది. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ప్రతి మ్యాచ్ గెలవాల్సిన ఆర్సీబీ స్వల్ప టార్గెటే ఉంచడం ఢిల్లీకి చేధన సులువయ్యే అవకాశాలు ఉన్నాయి.
మరోసారి బెంగళూరు బ్యాట్స్ మెన్ అతి తక్కువ వ్యక్తిగత స్కోరుకే వికెట్లు చేజార్చుకున్నారు. సిరాజ్ ఒక్క వికెట్ ఎల్బీ డబ్ల్యూగా అవుట్ అవగా మిగిలినవారంతా క్యాచ్ అవుట్ లే అయ్యారు. 20 ఓవర్లు పూర్తయ్యేసరికి టిమ్ సౌథీ, చాహల్ క్రీజులో ఉన్నారు.
ఓపెనర్లు పార్థివ్ పటేల్(9), విరాట్ కోహ్లీ(41) చేయగా.. డివిలియర్స్(17), మార్కస్ స్టోనిస్(15), మొయిన్ అలీ(32), అక్షదీప్ నాథ్(19), పవన్ నేగీ(0), టిమ్ సౌథీ(9), సిరాజ్(1), చాహల్(1) పరుగులు చేయగలిగారు.