లీగ్ పట్టికలో టాప్‌లోకి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

లీగ్ పట్టికలో టాప్‌లోకి చేరిన ఢిల్లీ క్యాపిటల్స్

Updated On : April 23, 2019 / 11:01 AM IST

అజింకార రహానె ఫామ్‌లోకి వచ్చాడనుకుంటున్న కొద్ది నిమిషాల్లోనే రాజస్థాన్ రాయల్స్ కలలను చిదిమేశాడు రిషబ్ పంత్. వీరోచిత ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను గెలిపించడమే కాదు. లీగ్ పట్టికలో టాప్ స్థానం దక్కించుకోవడానికి కారణమైయ్యాడు.  

దీంతో ట్విట్టర్ వేదికగా రిషబ్ పంత్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆఖరి సారి నేను కాలుష్య నగరంగా ఢిల్లీని టాప్ పొజిషన్‌లో చూశా. మళ్లీ ఇన్నాళ్లకు..

 

2008 సీజన్ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్థానానికి చేరడం ఎప్పుడైనా చూశామా.. కానీ, ఈ సారి అది సాధ్యమైంది. కంగ్రాచ్యులేషన్స్… రహానె ఫామ్‌లోకి వచ్చినా ఢిల్లీనే గెలిచింది. 

ఐపీఎల్ లీగ్ పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ స్థానం చేరుకోవడం సంతోషాన్ని కలుగచేస్తుంది.  

 

ఢిల్లీ అభిమానులంతా ఒక పని చేయండి.. మళ్లీ ఎంతకాలానికి ఇలా టాప్‌లో కనిపిస్తుందో.. ఇప్పుడే ఫొటో తీసిపెట్టుకోండి. 

 

దశాబ్ద కాలం తర్వాత ఢిల్లీ టాప్ స్థానానికి చేరింది. నమ్మశక్యంగా అనిపించడం లేదు.