Dhruv Jurel : వికెట్ కీపింగ్ అంటే అంత ఈజీ కాదు జురెల్‌..! ఇప్పుడు చూడు.. ఇంగ్లాండ్‌కు అప్ప‌నంగా నాలుగు ప‌రుగులు

ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతోంది.

Dhruv Jurel : వికెట్ కీపింగ్ అంటే అంత ఈజీ కాదు జురెల్‌..! ఇప్పుడు చూడు.. ఇంగ్లాండ్‌కు అప్ప‌నంగా నాలుగు ప‌రుగులు

Dhruv Jurel

Dhruv Jurel – Kuldeep Yadav : ఇంగ్లాండ్‌తో భార‌త జ‌ట్టు ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడుతోంది. తొలి రెండు టెస్టుల్లో కీపింగ్‌లో రాణించిన‌ప్ప‌టికీ బ్యాటింగ్‌లో విఫ‌లం కావ‌డంతో తెలుగు ఆట‌గాడు కేఎస్ భ‌ర‌త్ జ‌ట్టులో స్థానం కోల్పోయాడు. అత‌డి స్థానంలో రాజ్‌కోట్ టెస్టు మ్యాచులో ధ్రువ్ జురెల్‌కు అవ‌కావం ఇచ్చారు. కాగా.. జురెల్ ఈ మ్యాచ్‌తోనే అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశాడు. బ్యాటింగ్‌లో 104 బంతులు ఎదుర్కొన్న అత‌డు 2 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 46 ప‌రుగులు చేసి తృటిలో అర్ధ‌శ‌త‌కాన్ని చేజార్చుకున్నాడు. అశ్విన్‌తో క‌లిసి ఎనిమిదో వికెట్‌కు 77 ప‌రుగుల కీల‌క భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పాడు.

బ్యాటింగ్‌లో రాణించిన జురెల్ కీపింగ్ కాస్త త‌డ‌బ‌డ్డాడు. ముఖ్యంగా కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌ను అర్థం చేసుకోవ‌డంలో ప‌లు మార్లు ఇబ్బందుల‌కు గురి అయ్యాడు. ఇన్నింగ్స్ 55వ ఓవ‌ర్‌ను కుల్దీప్ యాద‌వ్ వేశాడు. బెన్‌స్టోక్స్ స్ట్రైకింగ్‌లో ఉండ‌గా మూడో బంతికి గూగ్లీని సంధించాడు. స్టోక్స్ ఫార్వ‌డ్ డిఫెన్స్ ఆడాడు. అయితే.. బంతి అత‌డి బ్యాట్‌, పాడ్ల‌ను తాక‌లేదు. కొంచెం ఎక్కువ బౌన్స్ అయిన బంతి బ్యాట‌ర్‌తో పాటు వికెట్ కీప‌ర్ ధ్రువ్ జురెల్‌కు సైతం దొర‌క‌కుండా ఫోర్‌గా వెళ్లింది. దీంతో ఇంగ్లాండ్‌కు బైస్ రూపంలో నాలుగు ప‌రుగులు వ‌చ్చాయి.

IND vs ENG 3rd Test : మూడో రోజు ఆట‌లో న‌ల్ల‌రిబ్బ‌న్ల‌తో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా ప్లేయ‌ర్లు.. ఎందుకో తెలుసా?

ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. వికెట్ కీపింగ్ అంటే అంత ఈజీ కాదు జురెల్ అంటూ నెటిజ‌న్లు స‌ర‌దాగా కామెంట్లు చేస్తున్నారు. తొలి మ్యాచ్ కాబ‌ట్టి కాస్త త‌డ‌బాటు త‌ప్ప‌ద‌ని కొంద‌రు అత‌డికి మ‌ద్ద‌తుగా నిలుస్తున్నారు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రోహిత్ శ‌ర్మ‌(132), జ‌డేజా (112) లు శ‌త‌కాలు బాద‌డంతో టీమ్ఇండియా మొద‌టి ఇన్నింగ్స్‌లో 445 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అరంగేట్ర ఆట‌గాళ్లు స‌ర్ఫ‌రాజ్ ఖాన్(62), ధ్రువ్ జురెల్‌(46)లు సైతం రాణించారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో మార్క్‌వుడ్ నాలుగు, రెహాన్ అహ్మ‌ద్ రెండు, జేమ్స్ అండ‌ర్స‌న్‌, టామ్ హార్డ్లీ, జో రూట్‌లు తలా ఓ వికెట్ తీశారు.

IND vs ENG : టెస్టు మ్యాచ్ మ‌ధ్య‌లో వెళ్లిపోయిన అశ్విన్‌.. అత‌డి స్థానంలో అక్ష‌ర్ ఆడొచ్చా? నిబంధ‌న‌లు ఏమి చెబుతున్నాయంటే?

అనంత‌రం మొద‌టి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన‌ ఇంగ్లాండ్ మూడో రోజు లంచ్ విరామ స‌మ‌యానికి ఐదు కోల్పోయి 290 ప‌రుగులు చేసింది. ఓపెనర్ బెన్ డ‌కెట్(153) భారీ సెంచ‌రీతో చెల‌రేగాడు. ప్ర‌స్తుతం క్రీజులో కెప్టెన్‌ బెన్‌స్టోక్స్ (39), బెన్ ఫోక్స్ (6) లు ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు తీశాడు. బుమ్రా, సిరాజ్‌, అశ్విన్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.