ICC రూల్ బ్రేక్ చేసి బంతికి ఉమ్మి రుద్దిన Robin Uthappa

ICC రూల్ బ్రేక్ చేసి బంతికి ఉమ్మి రుద్దిన Robin Uthappa

Updated On : October 2, 2020 / 11:04 AM IST

కరోనా నేపథ్యంలో ICC జారీ చేసిన COVID-19 ప్రొటోకాల్‌ను భారత క్రికెటర్‌ Robin Uthappa అతిక్రమించాడు. రాజస్తాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న ఉతప్ప బుధవారం రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో బంతికి ఉమ్మును రుద్దాడు. పొరపాటో…అలవాటో లేక అలవాటులో పొరబాటో గానీ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లో కామన్‌గా ఈ పని చేసేశాడు. ఐదో బంతిని ఆడిన కోల్‌కతా ఓపెనర్‌ నరైన్‌ ఇచ్చిన క్యాచ్‌ను రాబిన్‌ నేలపాలు చేశాడు. తర్వాత బంతికి ఉమ్మును రుద్దుతూ కెమెరా కంటపడ్డాడు.

ఐసీసీ నిబంధనల ప్రకారం ఉమ్మి రుద్దడాన్ని నిషేధించారు. అలా చేస్తే అంపైర్లు బంతిని శానిటైజ్‌ చేసి నిబంధనలు గుర్తు చేస్తారు. అలా మళ్లీ ఇంకొకసారి హెచ్చరిస్తారు. అప్పటికీ మారకపోతే శిక్షగా ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు అదనంగా ఇస్తారు.



ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (KKR)మరోసారి విజృంభించింది. రాజస్థాన్ రాయల్స్‌ను (RR) 37 పరుగుల తేడాతో ఓడించి ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో టోర్నీలో కోల్‌కతా టీమ్ రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్లను కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసింది. నైట్‌రైడర్స్ చేసిన కట్టుదిట్టమైన బౌలింగ్ ధాటికి.. రాయల్స్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పెవిలియన్‌కు క్యూ కట్టింది.