కోల్‌కతా గెలిచినా.. దినేష్ కార్తీక్ పేరిట చెత్త రికార్డు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడోసారి ఐపీఎల్ టైటిల్‌పై దృష్టి సారించింది. కానీ ఈ సీజన్లో జట్టు అరంగేట్రం కాస్త ఇబ్బందికరంగా మొదలైంది. ముంబై ఇండియన్స్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లో KKR 49 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
అయితే, కెప్టెన్ దినేష్ కార్తీక్ సారధ్యంలోని కోల్‌కతా నైట్ రైడర్స్ రెండవ మ్యాచ్‌లో మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను చిత్తు చేసింది. 7 వికెట్ల తేడాతో జట్టుపై విజయం సాధించింది. కానీ కెప్టెన్ దినేష్ కార్తీక్ ప్రదర్శన మాత్రం ఈ మ్యాచ్‌లో నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ ఓ చెత్త రికార్డును కూడా క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ డక్ అవుట్ అయి ఐపిఎల్‌లో హైదరాబాద్‌పై సున్నాకే అవుట్ అయిన వ్యక్తిగా మొదటి స్థానంలో నిలిచాడు.
హైదరాబాద్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో దినేష్ కార్తీక్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు రాగా.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే ఎల్‌బిడబ్ల్యూ అయ్యాడు. హైదరాబాద్‌తో సున్నాకి అవుట్ అవడం ఐపీఎల్‌లో ఇది నాల్గవసారి. దీంతో హైదరాబాద్‌పై డకౌట్ అయిన చెత్త రికార్డ్‌లో దినేష్ కార్తీక్ అగ్ర స్థానంలో నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు అజింక్య రహానే పేరిట ఉంది. రహానే SRHపై మూడుసార్లు అవుట్ అయ్యాడు.
హైదరాబాద్‌పై డకౌట్ అయిన బ్యాట్స్‌మన్లు:
దినేష్ కార్తీక్ – 4 సార్లు
అజింక్య రహానె – 3 సార్లు
ఇదే కాకుండా, ఒకే జట్టుపై అత్యధికంగా డక్‌అవుట్ అయిన రికార్డ్‌ల్లో ఐపీఎల్‌లో కేదార్ జాదవ్, రోహిత్ శర్మలతో దినేష్ కార్తీక్ కలిశారు. ఐపీఎల్‌లో కేదార్ జాదవ్ పంజాబ్‌పై ఇప్పటివరకు నాలుగు వికెట్లు కోల్పోగా, రోహిత్ శర్మ ఆర్‌సిబిపై నాలుగు సార్లు డకౌట్ అయ్యాడు. దినేష్ కార్తీక్ ఇప్పుడు హైదరాబాద్‌పై నాలుగుసార్లు సున్నాకి అవుటయ్యాడు.
ఐపీఎల్‌లో ఒకే జట్టుపై డకౌట్ అయిన వాళ్లు:
దినేష్ కార్తీక్ – హైదరాబాద్‌పై 4 సార్లు
కేదార్ జాదవ్ – పంజాబ్‌పై 4 సార్లు
రోహిత్ శర్మ – ఆర్‌సిబిపై 4 సార్లు
ఇక ఇదే విషయమై కార్తీక్ స్పందిస్తూ.. కేవలం డకౌట్ ఏ ఆటగాడికి చెడ్డ పేరు తీసుకురాలేదని అన్నాడు.. తన అంశంలోనూ ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చాడు.