పంజాబ్ మ్యాచ్‍లో దినేశ్ కార్తీక్ కోపానికి కారణమిదే..

కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అడుగుజాడల్లో నడిచే ప్లేయర్. ధోనీని చూసే కూల్ నెస్ నేర్చుకున్నానని పలు సందర్భాల్లో చెప్పాడు. అలాంటిది కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో మ్యాచ్‌లో సొంత జట్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అందరినీ నిల్చొబెట్టి లెఫ్టె అండ్ రైట్ ఇచ్చేశాడు.
ఫలితంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ 184పరుగుల లక్ష్యాన్ని చేధించి విజయాన్ని దక్కించుకుంది. శుభ్‍మాన్ గిల్ చేసిన 65పరుగులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. సీజన్ మొదట్లో జరిగిన 5మ్యాచ్‌లకు నాలుగింటిలో గెలుపొందిన కేకేఆర్ వరుస వైఫల్యాలను చవిచూసింది. ఆ తర్వాత ముంబై ఇండియన్స్.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌లపై బ్యాక్ టు బ్యాక్ విక్టరీని ఒడిసిపట్టింది.
మ్యాచ్ మధ్యలో కోపం వ్యక్తం చేయడంపై దినేశ్ ఇలా చెప్పుకొచ్చాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్ గేల్‌లను సందీప్ వారియర్ అవుట్ చేశాడు. అప్పటికీ కోల్‌కతా నత్తనడకన సాగుతుంది. సునీల్ నరైన్ అసంతృప్తిగా కనిపిస్తున్నాడు. బౌలర్ల ప్రదర్శనపై అసహనంతో ఉన్న కార్తీక్.. ‘కొద్ది రోజులుగా బౌలర్ల ప్రదర్శనపై నిరాశగా ఉంటున్నా. ఫీల్డింగ్‌లోనూ అంతే. ఇది టీంలో వాళ్లకు తెలియాలని అందరికీ చెప్పా. నా కోపాన్ని చాలా తక్కువ సార్లు చూసి ఉంటారు. అలా ఉంటేనే జట్టు బాగా ఆడుతుందనుకుంటే అలానే ఉంటా’ అని దినేశ్ కార్తీక్ వెల్లడించాడు.
??#KKR pic.twitter.com/yGnu8enbYU
— IndianPremierLeague (@IPL) May 3, 2019