Vinod Kumar : చేతికొచ్చిన పతకం చేజారింది..
భారత డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పారాలింపిక్స్ పురుషుల F52 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు వినోద్.

Vinod
Vinod Kumar Loses Bronze: భారత డిస్కస్ త్రోయర్ వినోద్ కుమార్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. పారాలింపిక్స్ పురుషుల F52 ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు వినోద్. 41 ఏళ్ల వినోద్ కుమార్ డిస్క్‌ను 19.91 మీటర్ల దూరం విసిరి కాంస్య పతకాన్ని సాధించగా.., పోలాండ్‌కు చెందిన పియోటర్ కోసెవిచ్ (20.02 మీ) మరియు క్రొయేషియాకు చెందిన వెలిమిర్ సాండర్ (19.98 మీటర్లు) ఆసియా రికార్డు క్రియేట్ చేశారు.
అయితే, వినోద్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని ఫిర్యాదు అందడంతో అతడు గెలిచిన పతకాన్ని నిర్వహకులు హోల్డ్‌లో ఉంచారు. అయితే, ఇవాళ ఫిర్యాదును సమీక్షించిన నిర్వహకులు వినోద్ కుమార్ F52 కేటగిరీ పరిధిలోకి రాడని తేల్చి అతను గెలుచుకున్న కాంస్య పతకాన్ని రద్దు చేశారు. అయితే, ఇదే నిర్వహకులు ఈ నెల 22న వినోద్ కుమార్ F52 కేటగిరీలో పోటీపడవచ్చని అనుమతివ్వడం చర్చనీయాంశం అయ్యింది.
కండరాల సామర్థ్యం తక్కువగా ఉన్నవారు. కదలికలు పరిమితంగా ఉండేవారు.. అవయవ లోపం ఉన్న వారు మాత్రమే F52 కేటగిరీ పరిధిలోకి వస్తారని, వినోద్ కుమార్ ఈ కేటగిరీ పరిధిలోకి రాడని, పారా అథ్లెట్లను వారి రుగ్మత ఆధారంగా కేటగిరీలుగా వర్గీకరించారు. వర్గీకరణ వ్యవస్థ ఒకే రుగ్మత ఉన్న ఆటగాళ్లను పోటీ చేయడానికి అనుమతి ఇస్తుంది. నిర్వాహకులు ఆగస్టు 22న వినోద్ వర్గీకరణ చేసారు.
వినోద్ కుమార్ తండ్రి 1971 ఇండో-పాక్ యుద్ధంలో పోరాడారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF)లో చేరిన తర్వాత శిక్షణ పొందుతున్న సమయంలో లేహ్‌లోని శిఖరం నుంచి కిందపడి, వినోద్ కుమార్ కాలికి గాయమైంది. ఈ కారణంగా, అతను దాదాపు ఒక దశాబ్దం పాటు మంచం మీద ఉన్నాడు మరియు ఈ సమయంలో అతని తల్లిదండ్రులు ఇద్దరూ మరణించారు.