Champions Trophy : అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన జట్టు ఏదో తెలుసా? ఏ సంవత్సరం ఏ జట్టు విజయం సాధించిందంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అత్యధిక సార్లు నిలిచిన జట్టు ఏదంటే?

Do you know which team winning most times of Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి అంకానికి చేరుకుంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య మార్చి9న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఆదివారం దుబాయ్ వేదికగా కప్పు కోసం భారత్, కివీస్‌లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. గ్రూప్ స్టేజీలో కివీస్‌ను ఓడించిన ఉత్సాహంతో భారత్ బరిలోకి దిగుతోంది. అయితే.. ఐసీసీ టోర్నీల్లో కివీస్ ఎంత ప్రమాదకర జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇదిలా ఉంటే.. మొదట్లో దీన్ని ఛాంపియన్స్ ట్రోఫీ అని పిలిచేవారు కాదు. అప్పట్లో ఈ టోర్నీని ఏమని పిలిచే వారో తెలుసా? ఇప్పటి వరకు ఎన్ని సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారో తెలుసా?
1998లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రవేశపెట్టారు. అప్పట్లో దీన్ని “ఇంటర్నేషన్ కప్” అని పిలిచేవారు. 2000 దీని పేరును ‘ఐసీసీ నాకౌట్ టోఫ్రీ’గా పేరు మార్చారు. 2002లో ‘ఛాంపియన్స్ ట్రోఫీ’గా నామకరణం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పేరుతో కొనసాగుతోంది.
ఇప్పటి వరకు 8 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించారు. తాజా ఎడిషన్ తొమ్మిదోది.
కాగా.. భారత్, ఆస్ట్రేలియా జట్లు అత్యధిక సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచాయి. ఇరు జట్లు చెరో రెండు సార్తు విజేతగా నిలిచాయి. కివీస్‌తో ఫైనల్ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిస్తే మూడు సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలిచిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది.
IND vs NZ : ఫైనల్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్.. భారత్ ఇక మ్యాచ్ గెలిచినట్లే..!
ఇప్పటి వరకు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతలు వీరే..
– వెస్టిండీస్ పై దక్షిణాఫ్రికా విజయం (1998లో)
– భారత్ పై న్యూజిలాండ్ గెలుపు (2000లో)
– భారత్, శ్రీలంక (2002లో వర్షం కారణంగా ఫైనల్ మ్యాచ్ రద్దు కావడంతో)
– ఇంగ్లాండ్ పై వెస్టిండీస్ విజయం (2004లో)
– వెస్టిండీస్ పై ఆస్ట్రేలియా విజయం(2006లో)
– న్యూజిలాండ్ పై ఆస్ట్రేలియా గెలుపు (2009లో)
– ఇంగ్లాండ్ పై భారత్ విజయం (2013లో)
– భారత్ పై పాకిస్థాన్ గెలుపు (2017లో)