ENG vs IND : రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 364 ఆలౌట్‌.. ఇంగ్లాండ్ టార్గెట్ 371

హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు 371 ప‌రుగుల టార్గెట్ నిలిచింది.

ENG vs IND : రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 364 ఆలౌట్‌.. ఇంగ్లాండ్ టార్గెట్ 371

Updated On : June 23, 2025 / 10:58 PM IST

హెడింగ్లీ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్ ముందు 371 ప‌రుగుల టార్గెట్ నిలిచింది. రెండో ఇన్నింగ్స్‌లో భార‌త్ 364 ప‌రుగుల‌కు ఆలౌలైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో కేఎల్ రాహుల్ (137; 247 బంతుల్లో 18 ఫోర్లు), రిష‌బ్ పంత్ (118; 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) సెంచ‌రీలు చేశారు.

మిగిలిన వారిలో సాయి సుద‌ర్శ‌న్ (30), క‌రుణ్ నాయ‌ర్ (20) ఓ మోస్త‌రుగా రాణించ‌గా మిగిలిన వారు విఫ‌లం అయ్యారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్ లు చెరో మూడు వికెట్లు తీశారు. షోయబ్ బషీర్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. క్రిస్ వోక్స్, బెన్ స్టోక్స్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు…

 

తొలి ఇన్నింగ్స్‌లో భార‌త్ 471 ప‌రుగులు చేసింది. ఆ త‌రువాత ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 465 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో భార‌త్ కు 6 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది.