Ashes : లెజెండ్ పై వేటు.. ఐదు వికెట్లు తీసినా యువ ఆటగాడికి నో ఛాన్స్.. మూడో టెస్టుకు ఇంగ్లాండ్..
యాషెస్ సిరీస్( Ashes)లో ఇంగ్లాండ్ బజ్‌బాల్ వ్యూహాం పనిచేయడం లేదు. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఘోర పరాభవాలను చవిచూసింది.

James Anderson Dropped
Ashes ENG vs AUS : యాషెస్ సిరీస్( Ashes)లో ఇంగ్లాండ్ బజ్‌బాల్ వ్యూహాం పనిచేయడం లేదు. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా (Australia) చేతిలో ఘోర పరాభవాలను చవిచూసింది. ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో నిలవాలంటే లీడ్స్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ (England) తప్పక గెలవాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ఈ కీలక మైన టెస్టులో రాణించాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో పలు మార్పులు చేసింది.
ఇక అందరూ ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson)పై వేటు పడింది. అదే సమయంలో రెండో టెస్టులో ఐదు వికెట్లతో సత్తా చాటిన యువ బౌలర్ జోష్ టంగ్‌ను పక్కన బెట్టింది. ఈ నిర్ణయం అందరిని ఆశ్చర్యపరిచింది. వీరి స్థానాల్లో ఆల్‌రౌండర్లు అయిన క్రిస్ వోక్స్‌తో పాటు మార్క్‌వుడ్‌లను తీసుకుంది. భుజం గాయంతో సిరీస్‌కు దూరం అయిన బ్యాటర్ ఓలీపోప్ స్థానంలో ఆల్‌రౌండర్ మొయిన్ అలీ కి చోటు ఇచ్చింది.
Virat Kohli Reverse Sweep : కోహ్లి ఇలాంటి షాట్లు ఆడడం ఎప్పుడు చూసి ఉండరు.. వీడియో వైరల్
మూడో టెస్టుకు ఇంగ్లాండ్ తుది జట్టు : జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్ స్టో(వికెట్ కీపర్), బెన్ స్టోక్స్ (కెప్టెన్), మొయీన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్.
? We can confirm our XI for the third Ashes Test in Leeds…
Three changes from Lord’s…
↩️ Ollie Pope
↩️ Josh Tongue
↩️ Jimmy Anderson↪️ Moeen Ali
↪️ Mark Wood
↪️ Chris Woakes#EnglandCricket | #Ashes— England Cricket (@englandcricket) July 5, 2023
Ashes : వరుసగా రెండు టెస్టులు గెలిచిన ఆస్ట్రేలియాకు భారీ షాక్.. ఇప్పుడెలా..?
మరోవైపు.. ఈ టెస్టు మ్యాచ్ ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్(Steve Smith)కు వందో మ్యాచ్ కావడం విశేషం. ఈ క్రమంలో కీలక మ్యాచ్‌లో పరుగుల వరద పారించాలని స్మిత్ ఆరాటపడుతున్నాడు. ఇక బంతిని ఆపే క్రమంలో గాయపడి సిరీస్ మొత్తానికే దూరం అయిన స్పిన్నర్ నాథన్ లైయన్ స్థానంలో యువ ఆటగాడు టాడ్ మర్ఫీని ఆసీస్ తుది జట్టులోకి తీసుకోనుంది. వరుస విజయాలతో జోష్‌లో ఉన్న ఆసీస్ అదే ఉత్సాహంలో మూడో టెస్టులోనూ విజయం సాధించి యాషెస్‌ను సొంతం చేసుకోవాలని భావిస్తోంది. అదే గనుక జరిగితే ఇంగ్లాండ్ గడ్డపై 22 సంవత్సరాల తరువాత యాషెస్ నెగ్గిన కెప్టెన్‌గా కమిన్స్ చరిత్ర సృష్టిస్తాడు.