ODI World Cup 2023 : ఇంగ్లాండ్ హ్యాట్రిక్ ఓట‌ములు.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ వైర‌ల్‌..

భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు వ‌రుసగా హ్యాట్రిక్ ఓట‌ముల‌ను చ‌విచూసింది.

ODI World Cup 2023 : ఇంగ్లాండ్ హ్యాట్రిక్ ఓట‌ములు.. వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ వైర‌ల్‌..

Virender Sehwag comments on eng

ODI World Cup : భార‌త్ వేదిక‌గా జ‌రుగుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో ఇంగ్లాండ్ జ‌ట్టు వ‌రుసగా హ్యాట్రిక్ ఓట‌ముల‌ను చ‌విచూసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ మెగా టోర్నీలో ఐదు మ్యాచులు ఆడ‌గా నాలుగు మ్యాచుల్లో ఓడిపోవ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో తొమ్మిదో స్థానంలో కొన‌సాగుతోంది. వ‌రుస ఓట‌ముల కార‌ణంగా ఇంగ్లాండ్ సెమీస్ అవ‌కాశాలు దాదాపు తుడిచి పెట్టుకుపోయాయ‌ని చెప్పొచ్చు. గురువారం బెంగ‌ళూరు వేదిక‌గా శ్రీలంకతో జ‌రిగిన మ్యాచులో 8 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయింది.

ఇంగ్లాండ్ జ‌ట్టు పై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో సెటైర్లు ప‌డుతున్నాయి. ఇంగ్లాండ్ అభిమానుల‌తో పాటు మాజీ ఆట‌గాళ్లు త‌మ జ‌ట్టు ఓట‌ములను జీర్ణించుకోలేక‌పోతున్నారు. ఇంగ్లాండ్ ఆట‌గాళ్ల‌పై మండిప‌డుతున్నారు. ఇదిలా ఉంటే.. భార‌త మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ ఇంగ్లాండ్ టీమ్‌పై చేసిన ఓ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. టెస్టుల్లో, టీ20ల్లో ఇంగ్లాండ్ టీమ్ ఎలాగున్నా స‌రే వ‌న్డేల్లో మాత్రం ఇంగ్లాండ్ చాలా సామాన్య‌మైన జ‌ట్టు అని అన్నాడు.

ENG vs SL : మాది చెత్త టీమ్‌ కాదు.. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు : బ‌ట్ల‌ర్‌

స్వ‌దేశంలో జ‌రిగిన 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ మిన‌హా గ‌త 8 ప్ర‌య‌త్నాల్లో 7 సార్లు ఆ జ‌ట్టు సెమీస్ చేరుకోలేక‌పోయింద‌ని చెప్పాడు. స్థిర‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేయ‌డంలో విఫ‌ల‌మైంద‌న్నాడు. జ‌ట్టును ప‌దే ప‌దే మార్చ‌డం, ఆట‌గాళ్ల‌పై న‌మ్మ‌కాన్ని ఉంచ‌క‌పోవ‌డం, టెస్టుల్లో ఎంత బ‌లంగా ఉన్నారో వ‌న్డేల్లోనూ అంతే బ‌లంగా ఉన్నామ‌ని త‌ప్పుగా భావించ‌డ‌మే ఇంగ్లాండ్ ఓట‌ముల‌కు కార‌ణ‌మ‌ని సెహ్వాగ్ అన్నాడు.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. మొద‌ట బ్యాటింగ్ చేసిన‌ ఇంగ్లాండ్ 33.2 ఓవ‌ర్ల‌లో 156 ప‌రుగుల‌కే ఆలౌటైంది. బెన్‌స్టోక్స్ (43), బెయిర్ స్టో (30) రాణించ‌గా మిగిలిన వారు విప‌లం అయ్యారు. శ్రీలంక బౌలర్లలో లహిరు కుమార మూడు వికెట్లు తీశాడు. మాథ్యూస్, కసున్ రజిత చెరో రెండేసి వికెట్లు ప‌డ‌గొట్టారు. మహేశ్ తీక్షణ ఒక వికెట్ సాధించాడు. ల‌క్ష్యాన్ని శ్రీలంక రెండు వికెట్లు కోల్పోయి 25.4 ఓవ‌ర్ల‌లో ఛేదించింది. ఓపెన‌ర్ పాతుమ్ నిస్సాంక (77 నాటౌట్‌), సదీర సమరవిక్రమ (65నాటౌట్‌) అర్థ‌శ‌త‌కాల‌తో జ‌ట్టుకు విజ‌యాన్ని అందించారు. శ్రీలంక కోల్పోయిన రెండు వికెట్ల‌ను ఇంగ్లాండ్ బౌల‌ర్ డేవిడ్ విల్లీ ప‌డ‌గొట్ట‌డం గ‌మ‌నార్హం.

ODI World Cup 2023 : లైటింగ్ షో.. అభిమానులకు అనుభూతి.. క్రికెటర్లకు భయానక అనుభవం