ENG vs IND : అక్కడుంది శుభ్‌మన్ గిల్.. మీ పప్పులు ఉడకవ్.. ఇంగ్లాండ్ బౌలర్ ఎత్తును చిత్తు చేసిన గిల్..
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా పుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు

England pacer Brydon Carse Tries To Distract Shubman Gill With Fake No-Ball Signal
ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో భారత జట్టు కెప్టెన్‌గా పుల్‌టైమ్ బాధ్యతలు చేపట్టిన గిల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సారథిగా ముందుండి నడిపిస్తున్నాడు. తొలి టెస్టు మ్యాచ్‌లో సెంచరీ చేసిన గిల్.. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ శతకంతో చెలరేగాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు తన ఏకాగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలు చేసినా.. అతడు మాత్రం ఏ మాత్రం తన దృష్టి మరల్చుకోకుండా సెంచరీ చేశాడు.
ఇంగ్లాండ్ బౌలర్ బ్రైడాన్ కార్స్.. గిల్ దృష్టిని మరల్చి అతడిని ఔట్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే.. అతడు ఈ ప్రయత్నంలో విఫలం అయ్యాడు. భారత ఇన్నింగ్స్ 34వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లోని నాలుగో బంతిని వేసేందుకు కార్స్.. రన్నప్ చేస్తూ తన ఎడమ చేతితో నో బాల్ సిగ్నల్ ఇచ్చాడు.
Mind games or genuine distraction? We’ll never know 🤷♂️#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings pic.twitter.com/iIO2NH1HXR
— Sony Sports Network (@SonySportsNetwk) July 2, 2025
అంపైర్ నో బాల్ ఇచ్చినట్లుగా గిల్ అనుకోవాలని ఇలా చేశాడు. అయితే.. దీన్ని పసిగట్టిన గిల్.. ఆ బంతిని ఆడకుండా పక్కకు తప్పుకున్నాడు. దీంతో కార్స్ ఎంతో నిరాశ చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఉంది గిల్.. మీ పప్పులు ఏం ఉడకవ్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. ఆట ముగిసే సమయానికి అతడు 216 బంతుల్లో 114 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అతడికి తోడుగా రవీంద్ర జడేజా (41) క్రీజులో ఉన్నాడు. టీమ్ ఇండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (87) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ (2), నితీశ్ కుమార్ రెడ్డి (1)లు ఘోరంగా విఫలం అయ్యారు.