Eng Vs Ind: భారత్ ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..

ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు.

Eng Vs Ind: భారత్ ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే..

Updated On : August 2, 2025 / 10:40 PM IST

Eng Vs Ind: ఇంగ్లాండ్ తో ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ ఆలౌట్ అయ్యింది. సెకండ్ ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. 164 బంతుల్లో 118 పరుగులు చేశాడు. ఆ తర్వాత ఆకాశ్ దీప్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజాలు అర్థ సెంచరీలతో మెరిశారు. ఆకాశ్ దీప్ 94 బంతుల్లో 66 పరుగులు, సుందర్ 46 బంతుల్లో 53 పరుగులు, జడేజా 77 బంతుల్లో 53 పరుగులు చేశారు.

ఇన్నింగ్స్ చివరలో సుందర్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 4 భారీ సిక్సులు బాది స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ టార్గెట్ 374 పరుగులు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 5 వికెట్లు తీశాడు. గస్ అట్కిన్ సన్ 3 వికెట్లు, ఓవర్ టన్ 2 వికెట్లు పడగొట్టారు.