Riyan Parag: రూ.3.8 కోట్ల ఆటగాడు.. 6 మ్యాచుల్లో చేసింది 58 పరుగులే.. ఇంకా ఎందుకు ఆడిస్తున్నారంటూ ఫ్యాన్స్ మండిపాటు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు రియాన్ పరాగ్ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా విఫలం అవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు

Riyan Parag
Riyan Parag: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) ఆటగాడు రియాన్(Riyan Parag) పరాగ్ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. వరుసగా విఫలం అవుతూ జట్టుకు భారంగా మారుతున్నాడు. కీలక సమయాల్లో పేలవ షాట్లతో ఔట్ అవుతూ జట్టును ఇబ్బందుల్లోకి నెడుతున్నాడు. ఈ క్రమంలో అతడిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్తువెత్తున్నాయి. కోట్లు పోసి తీసుకున్న ఈ ఆటగాడు ఈ సీజన్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లో కూడా రాణించింది లేదు.
గత సీజన్(ఐపీఎల్ 2022)లో 14 మ్యాచ్‌లు ఆడి 183 పరుగులు మాత్రమే చేసిన రియాన్ పరాగ్.. ఈ సీజన్ 6 మ్యాచ్‌లు ఆడి 58 పరుగులు చేసి తన వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ అతడిని రెండు మ్యాచ్‌లకు పక్కన బెట్టింది. అయినప్పటికీ అతడి ఆటతీరు మారలేదు. శుక్రవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా వికెట్లు పడడంతో ఇంపాక్ట్ ప్లేయర్‌గా రియాన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడు రియాన్.
IPL 2023, RR vs GT: ప్రతీకారం తీర్చుకున్న గుజరాత్.. రాజస్థాన్ పై ఘన విజయం
ఆరు బంతులు ఆడి నాలుగు పరుగులు మాత్రమే చేసి రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్భీగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో రాజస్థాన్ 118 పరుగలకే ఆలౌటైంది. 9 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో బ్యాటర్ల వైఫల్యంపై సోషల్ మీడియాలో రాజస్థాన్ అభిమానులు మండిపడుతున్నారు. మరీ ముఖ్యంగా రియాన్‌ను ఇంపాక్ట్ ఆటగాడిగా ఆడించడాన్ని తప్పుబడుతున్నారు.
ఆట తక్కువ డ్యాన్సులు ఎక్కువగా చేసే ఈ ఓవరాక్షన్ ఆటగాడిని ఎందుకు ఆడించారు. పైగా ఇతను ఇంపాక్ట్ ప్లేయర్ అట అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. ఇతగాడిని రూ.3.8 కోట్లు పెట్టి రాజస్థాన్ ఎందుకు తీసుకుందో వాళ్లకే తెలియాలి. వెంటనే అతడిని జట్టు నుంచి తీసివేయండి. ఇతడి కంటే గల్లీ క్రికెటర్లు వంద రెట్లు నయం అంటూ దుయ్యబట్టారు.
IPL 2023: రియాన్ పరాగ్‌ను దారుణంగా ట్రోలింగ్ చేస్తున్న నెటీజన్లు.. వెళ్లి డ్యాన్సులు వేసుకో
తనపై విమర్శల జడివాన కురుస్తున్న నేపథ్యంలో రియాన్ పరాగ్ ఓ ట్వీట్ చేశాడు. కాలం అనేది మంచిదో చెడ్డదో ఏదైనా కానివ్వండి.. కరిగిపోతూనే ఉంటుంది అంటూ రాసుకొచ్చాడు.