Arjun Tendulkar: ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌చిన్ కొడుకు అర్జున్ అరంగ్రేటం

క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో అరంగ్రేటం చేశాడు.

Arjun Tendulkar: ఐపీఎల్ చ‌రిత్ర‌లో తొలిసారి.. స‌చిన్ కొడుకు అర్జున్ అరంగ్రేటం

Arjun Tendulkar and Sachin Tendulkar

Updated On : April 16, 2023 / 4:58 PM IST

Arjun Tendulkar: క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ కుమారుడు అర్జున్ టెండూల్క‌ర్ ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)లో అరంగ్రేటం చేశాడు. సొంత మైదానంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ముంబై త‌రుపున బ‌రిలోకి దిగాడు. తొలి ఓవ‌ర్‌ను చాలా చ‌క్క‌గా వేశాడు. కేవ‌లం ఐదు ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. అయితే.. ఇక్క‌డ ఓ విశేషం ఉంది. తండ్రీ, కొడుకు ఇలా ఒకే జ‌ట్టు త‌రుపున ఆడ‌డం ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇదే తొలిసారి.

స‌చిన్ టెండూల్క‌ర్ ముంబై ఇండియ‌న్స్ త‌రుపున కొన్ని సీజన్లు ఆడిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు మెంటార్‌గా కూడా ఉన్నారు. అర్జున్ టెండూల్క‌ర్‌ను ముంబై ఇండియ‌న్స్ రెండేళ్ల క్రిత‌మే వేలంలో ద‌క్కించుకుంది. అయితే.. అత‌డికి మ్యాచ్‌లో ఆడే అవ‌కాశం మాత్రం ద‌క్క‌లేదు. నేడు 23 ఏళ్ల అర్జున్‌కు ఆ అవ‌కాశం వ‌చ్చింది. మ‌రీ ఏ మేర‌కు రాణిస్తాడోన‌ని స‌చిన్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

IPL 2023, MI vs KKR:దంచికొడుతున్న వెంక‌టేశ్ అయ్య‌ర్‌..live updates

అర్జున్ ప్ర‌స్తుతం దేశవాళీ క్రికెట్‌లో గోవాకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇప్పటివరకు ఏడు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్ ఎ మ్యాచ్‌లు, తొమ్మిది టీ20లు ఆడాడు. ఎడ‌మ చేతి వాటం బౌలింగ్ చేసే అర్జున్ బ్యాటింగ్ కూడా చేయ‌గ‌ల‌డు. ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఓ సెంచ‌రీ కూడా న‌మోదు చేశాడు. ఐపీఎల్ అరంగ్రేటం సంద‌ర్భంగా ప‌లువురు అర్జున్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ‘గుడ్ ల‌క్’ అర్జున్ అంటూ టీమ్ఇండియా ఆట‌గాడు ఇర్ఫాన్ ప‌ఠాన్ ట్వీట్ చేశాడు.