Champions Trophy: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ మాజీ స్పిన్నర్ ఛాలెంజ్‌.. ఏమన్నారో తెలుసా?

అందుకే, కారణంగానే పాక్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం రాణించలేకపోతోందని విమర్శలు ఉన్నాయి.

Champions Trophy: బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ మాజీ స్పిన్నర్ ఛాలెంజ్‌.. ఏమన్నారో తెలుసా?

Updated On : March 2, 2025 / 1:43 PM IST

బీసీసీఐకి పాకిస్థాన్ క్రికెట్ టీమ్‌ మాజీ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ సవాలు విసిరారు. భారత క్రికెట్ జట్టు నిజంగా అంత గొప్పదే అయితే, పాకిస్థాన్‌తో 10 టెస్ట్ మ్యాచులు, 10 వన్డేలు, 10 టీ20లు ఆడాలని చెప్పారు. తాను చెప్పినట్లు మ్యాచులు ఆడితే భారత్‌, పాకిస్థాన్‌లో ఏ జట్టు గొప్పదో నిజంగా తేలుతుందని అన్నారు.

Former Pakistan Spinner Saqlain Mushtaq

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌ను టీమిండియా ఆరు వికెట్లతో ఓడగొట్టిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌పై తీవ్ర విమర్శలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ మాజీ క్రికెటర్లు స్పందిస్తున్నారు.

Also Read: కొత్త ట్రాఫిక్ రూల్స్.. ఈ తప్పు చేసి దొరికితే రూ.25,000 ఫైన్.. ఏయే తప్పులకు ఎంత ఫైన్.. ఫుల్ డిటెయిల్స్

తాజాగా, సక్లైన్ ముస్తాక్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. రాజకీయ విషయాలను పక్కన పెడితే, భారత ఆటగాళ్లు బాగా ఆడే క్రికెటర్లేనని చెప్పారు. వారు క్రికెట్‌లో రాణిస్తున్నారని తెలిపారు. అయితే, నిజంగా భారత్‌ గొప్ప జట్టు అయితే, పాకిస్థాన్‌తో మ్యాచులు ఆడాలని, అప్పుడు ప్రతిదీ స్పష్టంగా తెలుస్తుందని చెప్పారు.

పాకిస్థాన్ క్రికెట్‌ టీమ్‌ ప్రిపరేషన్ బాగుంటే, సరైన దిశలో జట్టుకు మార్గనిర్దేశం చేస్తే తమ దేశ క్రికెట్ జట్టు అంతర్జాతీయ మ్యాచ్‌లలో బాగా రాణిస్తుందని సక్లైన్ ముస్తాక్ అన్నారు. తాము భారత్‌ సహా ప్రపంచానికి గట్టిగా జవాబు చెబుతామని వ్యాఖ్యానించారు.

కాగా, పాకిస్థాన్‌ జట్టు సెలెక్షన్ తీరు సరిగ్గా లేదని చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి. కొందరు సొంత ప్రయోజనాల కోసమే ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే పాక్‌ క్రికెట్‌ జట్టు ప్రస్తుతం రాణించలేకపోతోందని విమర్శలు ఉన్నాయి.