ODI World Cup 2023: గేట్‌వే ఆఫ్ ఇండియాపై క్రీడాకారుల ఫొటోలతో వరల్డ్ కప్ లైటింగ్ షో.. వీడియో వైరల్
వరల్డ్ కప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని సూచించేలా ఐసీసీ పలు ఫొటోలను ప్రదర్శనకు పెట్టింది. ఈ లైటింగ్ షోలో విరాట్ కోహ్లీ - నవీన్ ఉల్ హక్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Gateway of India
Special 3D Projection Gateway of India : దేశ ప్రజలు దీపావళి పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో శుక్రవారం ముంబైలోని చారిత్రాత్మక, ఐకానిక్ గేట్‌వే ఆఫ్ ఇండియాపై ఐసీసీ, బీసీసీఐ ప్రత్యేక 3డీ ప్రొజెక్షన్ ను ప్రదర్శించాయి. రెండు నిమిషాల పాటు రంగురంగుల వెలుగులు విరజిమ్మే లైట్ల మధ్య క్రీడాకారుల ఫొటోలతోపాటు వరల్డ్ కప్ థీమ్స్ తో అద్భుతమైన ప్రదర్శన ఆకట్టుకుంది. సెమీస్ కు చేరిన జట్లు, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆసీస్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్ వెల్, హెన్రిచ్ క్లాసెన్, పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ తో పాటు పలువురి క్రీడాకారుల ఫొటోలతో కూడిన లైటింగ్ షో వీక్షకులను ఆకట్టుకుంది.
వరల్డ్ కప్ సంతోషంతో పాటు గౌరవాన్ని తెచ్చిందని సూచించేలా ఐసీసీ పలు ఫొటోలను ప్రదర్శనకు పెట్టింది. ఈ లైటింగ్ షోలో విరాట్ కోహ్లీ – నవీన్ ఉల్ హక్ ఫొటోలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విరాట్, నవీన్ ఉల్ హక్ లు గత ఐపీఎల్ లో ఘర్షణ పడ్డ విషయం తెలిసిందే. అయితే, ఈ వరల్డ్ కప్ లో వారిద్దరూ స్నేహితులుగా మారిపోయారు. ఈ విషయాన్ని తెలియజేసేలా.. వైరాన్ని మరిచి పలకరించుకోవడాన్ని చూపిస్తూ ఫొటోలను గేట్‌వే ఆఫ్ ఇండియాపై ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ఐసీసీ తమ అధికారిక ఎక్స్ లో పోస్టు చేసింది. దీంతో అవి వైరల్ గా మారాయి. ఐసీసీ ప్రపంచ కప్ 2023 అంబాసిడర్ రిచర్డ్స్ మాట్లాడుతూ.. సెమీ ఫైనల్ కు ముందు ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియాపై ప్రపంచ కప్ క్షణాలను గుర్తుకు తెచ్చేలా రంగుంగుల వెలుగుల్లో ఫొటోల ద్వారా ప్రదర్శన ఆకట్టుకుందని అన్నారు.
WOW!
The Gateway of India lights up in Mumbai to celebrate #CWC23 and Diwali ?
Head to our WhatsApp channel to watch the full video: https://t.co/bYzj1L8sTU pic.twitter.com/HDCgBa0G3n
— ICC (@ICC) November 10, 2023
Diwali ? Cricket World Cup
A celebration of two big festivals at the Gateway of India ?#CWC23 pic.twitter.com/hgMBd0JwTV
— ICC (@ICC) November 10, 2023