Gambhir Video: అతడితో గౌతం గంభీర్ తీవ్ర వాగ్వివాదం.. వీడియో చూస్తారా?

గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, చూపుడు వేలిని చూపుతూ క్యురేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Gambhir Video: అతడితో గౌతం గంభీర్ తీవ్ర వాగ్వివాదం.. వీడియో చూస్తారా?

Gambhir Fight

Updated On : July 29, 2025 / 6:42 PM IST

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్ చివరి దశకు చేరుకుంది. ఓవల్‌లో జులై 31 నుంచి ఐదవ టెస్ట్ మ్యాచ్‌ జరగనుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో భారత జట్టు ప్రధాన కోచ్, మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ ఇవాళ మైదానం పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగారు. మంగళవారం మధ్యాహ్నం  భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మైదానంలోకి వచ్చారు. ఆయనతో గంభీర్‌ వాగ్వివాదానికి దిగారు.

ఏ విషయంలో ఈ గొడవ జరిగిందనేది ఇంకా తెలియకపోయినా, గంభీర్‌కు ఏదో విషయంపై తీవ్రమైన అసహనం కలిగిందని, ఆయన బ్యాటింగ్ కోచ్ సీతాంశు కోటక్‌తో కూడా ఈ విషయం చర్చించినట్లు తెలిసింది.

పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్‌పై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. “నీకు మేము ఏం చేయాలో చెప్పే హక్కు లేదు. మాకెవ్వరికీ చెప్పే హక్కు నీకు లేదు. నీవు గ్రౌండ్స్‌మాన్ లాగే ఉండాలి” అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ఫోర్టిస్, కోటక్‌తో గంభీర్ సుదీర్ఘంగా చర్చించారు. తొలుత కోచ్‌తో నేరుగా మాట్లాడకూడదని భావించిన ఫోర్టిస్.. కోటక్‌ను సంప్రదించే ప్రయత్నం చేయగా, గంభీర్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, చూపుడు వేలిని చూపుతూ క్యురేటర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి, ఇద్దరూ ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.