IND vs AUS : ఆసీస్‌తో మూడో టెస్టు.. రెండు మార్పులతో బరిలోకి దిగనున్న భారత్ : హర్భజన్ సింగ్
టీమ్ఇండియా రెండు మార్పులతో బ్రిస్బేన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తెలిపారు.

Harbhajan Singh Brisbane prediction two changes to India lineup
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న కీలకమైన మూడో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి బ్రిస్బేన్ వేదికగా ప్రారంభం కానుంది. ఇక రెండో టెస్టులో భారత్ ఓడిపోవడంతో మూడో టెస్టుకు ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగనుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ క్రమంలో టీమ్ఇండియా రెండు మార్పులతో బ్రిస్బేన్‌లో ఆడే అవకాశాలు ఉన్నాయని భారత మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ తెలిపారు.
పింక్ బాల్ టెస్టులో ఆరో స్థానంలో బరిలోకి దిగిన రోహిత్ శర్మ అదే స్థానంలో ఆడాలన్నాడు. కేఎల్ రాహుల్‌ను ఓపెనర్‌గా కొనసాగించాలని సూచించాడు. బ్రిస్బేన్ టెస్టులో భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో ఎలాంటి మార్పు ఉందని తాను భావిస్తున్నట్లు హర్భజన్ చెప్పాడు. మాజీ క్రికెటర్లు రోహిత్ శర్మను ఓపెనర్‌గా రావాలని సూచిస్తున్నారు. అయితే.. టీమ్ మేనేజ్మెంట్ అలా చేయదని భావిస్తున్నాను.
IND vs AUS : ఇదేం పిచ్చిరా అయ్యా.. ఇంకా 15 రోజులు ఉండగానే.. ఫస్ట్ డే టికెట్లు సోల్డ్..
కేఎల్, యశస్విలను ఓపెనర్లుగానే పంపాలి. ఫామ్‌లో లేని రోహిత్ శర్మను ఓపెనర్‌గా ఎలా పంపుతారని ప్రశ్నించాడు. హిట్‌మ్యాన్ మిడిల్ ఆర్డర్‌లోనే ఆడాలన్నాడు. ఇక అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకునే అవకాశాలు ఉన్నాయన్నాడు. హర్షిత్ రాణా స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను ఆడించే అవకాశాలను కొట్టిపారేయలేమన్నాడు.
అటు పుజరా సైతం భారత్ ఓ మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉందన్నాడు. అశ్విన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకుంటారని అంచనా వేశాడు. ఒక్క మ్యాచులో విఫలమైన హర్షిత్ రాణాకు మరో అవకాశం ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు.
IND vs AUS : మూడో టెస్టుకు ముందు భారత్‌కు ఊహించని షాక్.. గాయపడిన రిషబ్ పంత్..!